
కెరీర్‌లో పెహలీ బార్ (ఫస్ట్ టైమ్) హిందీ డైలాగ్స్ చెబుతున్నారు ఎన్టీఆర్. ‘రౌద్రం... రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) సినిమా కోసమే హిందీ మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. దాదాపు 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో ఒక్క మలయాళం తప్ప తెలుగు, తమిళ, కన్నడంలో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్, రామ్‌చరణ్. అలాగే హిందీలో కూడా సొంత వాయిస్‌నే వినిపించనున్నారు.
తాజాగా ఎన్టీఆర్ హిందీలో డబ్బింగ్ చెబుతున్న ఫొటో వైరల్ అవుతోంది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న థియేటర్స్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment