Mega 154 Movie Update: Director Bobby, Chiranjeevi Movie Dubbing Work Starts - Sakshi
Sakshi News home page

Mega 154 Movie Update: చిరు ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ‘మెగా154’ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Published Fri, Oct 14 2022 1:04 PM | Last Updated on Fri, Oct 14 2022 4:25 PM

Mega 154: Director Bobby, Chiranjeevi Movie Starts Dubbing Work - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం గాడ్‌ ఫాదర్‌ మూవీ విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. అదే జోష్‌తో తన నెక్ట్‌ ప్రాజెక్ట్స్‌ చకచక పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు చిరు. ప్రస్తుతం భోళా శంకర్‌, డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరు 154వ చిత్రంగా మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీ టీం మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ అందించింది. ఈ సినిమా డబ్బింగ్‌ పనులను స్టార్ట్‌ చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. దర్శకుడు బాబీ, పలువురు టెక్నిషియన్ల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాల నిర్వహించి డబ్బింగ్‌ పనులను మొదలు పెట్టారు.

చదవండి: 31 ఏళ్ల తర్వాత మళ్లీ రీపిట్‌ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్‌

ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే మరిన్ని భారీ అప్‌డేట్స్‌ ఇస్తామని ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్‌ తెలిపారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ క్రేజీ అప్‌డేట్‌ రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement