
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. వింటేజ్ లుక్‌లో చిరు స్టైల్‌కి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మూవీ భారీ విజయంతో వాల్తేరు వీరయ్య టీం ఫుల్ జోష్‌లో ఉంది. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ సందర్బంగా డైరెక్టర్ బాబీ కాకినాడలో పర్యటించాడు.
కాకినాడలోని పద్మప్రియ థియేటర్‌కు సందర్శించిన బాబీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాడు. ‘నేను 20 ఏళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమాని. ఆయనతో హిట్ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో ప్రతి సన్నివేశం ప్రాణం పెట్టి తీశాం. మూవీ ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అవకాశం వస్తే చిరంజీవితో భవిష్యతుల్లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాను’ అని వ్యాఖ్యానించాడు. కాగా ఆయనతో పాటు సినీ దర్శకుడు కల్యాణ్ కృష్ణ, వింటేజ్ సంస్థ అధినేత శివరామ్, చిన్ని, బెనర్జీలు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment