Chiranjeevi Costly Gift to Director Bobby for Waltair Veerayya Success - Sakshi
Sakshi News home page

Chiranjeevi: వాల్తేరు వీరయ్య సక్సెస్‌.. డైరెక్టర్‌కు మెగాస్టార్‌ కాస్ట్‌లీ గిఫ్ట్‌

Jan 19 2023 2:24 PM | Updated on Jan 20 2023 12:55 AM

Buzz: Chiranjeevi Costly Gifts to Director Bobby Ahead of Waltair Veerayya Success - Sakshi

సినిమా కోసం ప్రాణం పెట్టిన బాబీకి మెగాస్టార్‌ మర్చిపోలేని కానుక ఇచ్చాడట. వాల్తేరు వీరయ్య హిట్‌ అయిన నేపథ్యంలో బాబీని ఇంటికి విందుకు పిలిచి ఆ తర్వాత లగ్జరీ కారు కానుకగా ఇచ్చాడట.

మెగాస్టార్‌ చిరంజీవిని ఒకసారి నేరుగా చూడాలి, ఒక్కసారైనా కలిసి సెల్ఫీ తీసుకోవాలి.. ఇలా కలలు కనేవాళ్లు చాలామంది. ఈ కోవలోకే వస్తాడు దర్శకుడు బాబీ. చిన్నప్పటినుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాడు. మెగాస్టార్‌ మూవీ రిలీజైందంటే చాలు తండ్రితో కలిసి థియేటర్‌కు పరుగెత్తుకుంటూ వెళ్లేవాడు. అలాంటిది ఇప్పుడేకంగా ఆయనతో కలిసి సినిమానే తీశాడు. వాల్తేరు వీరయ్యతో చిరుకు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చాడు. కానీ ఈ సినిమాను తన తండ్రికి చూపించలేకపోయాడు. సినిమా మధ్యలోనే బాబీ తండ్రి కన్నుమూశారు. తండ్రి మరణించి గుప్పెడంత శోకంలో ఉన్నా సరే షూటింగ్‌కు వెళ్లాడంటే బాబీ అంకితభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

సినిమా కోసం ప్రాణం పెట్టిన బాబీకి మెగాస్టార్‌ మర్చిపోలేని కానుక ఇచ్చాడట. వాల్తేరు వీరయ్య హిట్‌ అయిన నేపథ్యంలో బాబీని ఇంటికి విందుకు పిలిచాడట. భోజనం ముగిశాక అతడికి లగ్జరీ కారు కానుకగా ఇచ్చినట్లు టాక్‌. దీని విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల మేర ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే చిరంజీవి, బాబీలలో ఎవరో ఒకరు స్పందించేవరకు ఆగాల్సిందే!

చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement