
భరత్ అనే నేను చిత్రంపై ప్రేక్షకుల నుంచే కాదు.. ప్రముఖలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు కలెక్షన్లు సునామీ కొనసాగుతున్న వేళ ఈ చిత్రం రీమేక్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
‘సమకాలీన రాజకీయాలు, సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచన మొదటి నుంచే లేదు. మిగతా భాషల్లో కూడా దీనిని డబ్ చేసి వదలబోతున్నాం. పొలిటికల్ నేపథ్యం కారణంగా ప్రతీ పౌరుడు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మిగతా చోట్ల కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అని కొరటాల పేర్కొన్నారు.