కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు రద్దవ్వడంతో మన సెలబ్రెటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే అనూహ్యంగా దొరికిన లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నారు. ఇక కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన పిల్లలు సితార, గౌతమ్‌లతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో మహేశ్ చేస్తున్న అల్లరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
ఇక చాలా ఆక్టీవ్‌గా ఉండే సితార గతంలో ‘భరత్ అనే నేను’ సినిమాలోని అరరే ఇది కలలా ఉన్నదే అనే సాంగ్‌ను ఆలపించింది. చాలా ఎనర్జటిక్‌గా పాడిన ఈ పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. సితార పాడిన పాటకు సంబంధించిన పాత వీడియోను నమ్రత తాజాగా తన ఇన్‌స్టాలో తిరిగి పోస్ట్ చేస్తూ ‘నాన్న కూతురు’ అనే కామెంట్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొన్ని గంటల వ్యవధిల్లోనే లక్షకు పైగా వ్యూస్ రాగా వేలల్లో లైక్స్ వచ్చాయి. ‘సింగర్‌గా ట్రై చేయ్ లిటిల్ ప్రిన్స్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
సితార సింగింగ్.. ఆ వీడియో మళ్లీ వైరల్
Published Fri, May 8 2020 9:32 AM | Last Updated on Fri, May 8 2020 9:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment