![Ram Charan Clarity On Acharya Hindi Version Release In Latest Interview - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/25/ram-charan_0.jpg.webp?itok=xNz2k3cP)
Ram Charan Clarifies On Acharya Hindi Version: రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్, కేజీయఫ్ చిత్రాల అనంతరం ప్రస్తుతం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున సినిమా ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులతో పాటు సౌత్ ప్రేక్షకులంతా ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదాల అనంతదరం ఏప్రిల్ 29న థియేటర్లో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 29న ఆచార్య దక్షిణాది అన్ని భాషల్లోనూ విడుదల అవుతుంది.
చదవండి: రాజమౌళి గురించి ఈ విషయం 12 ఏళ్ల క్రితమే చెప్పాను
కానీ, హిందీలో మాత్రం విడుదల కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆచార్య హిందీ వెర్షన్‌పై చరణ్ తాజాగా క్లారీటీ ఇచ్చాడు. రీసెంట్‌గా జరిగిన ఆచార్య మూవీ ప్రెస్‌మీట్‌లో చరణ్ మాట్లాడుతూ.. ‘ఆచార్య మూవీ షూటింగ్ మేం అనుకున్నదానికంటే ఎక్కువ ఆలస్యమైంది. అంతేకాదు నేను ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల్లో ఒకేసారి నటిస్తుండటంతో నాకు చాలా తక్కువ సమయం దొరికింది. దీనికి తోడు కరోనా లాక్‌డౌన్. అయితే మేం ఆచార్యను హిందీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు అక్కడ వచ్చిన రెస్పాన్స్ చూసి ఆచార్యను కూడా హిందీలో రిలీజ్ చేయాలని అనుకున్నాం.
చదవండి: దొంగతనం షురూ చేసిన బిగ్‌బాస్-5 విజేత సన్నీ
కానీ హిందీలో రిలీజ్ చేయాలంటే డబ్బింగ్, పొస్ట్‌ప్రొడక్షన్ పనులకు చాలా సమయంలో పడుతుంది. ఇప్పుడు మా దగ్గర అంత టైం లేదు. అందుకే ఏప్రిల్ 29కి హిందీ వెర్షన్‌ను రెడీ చేయలేకపోయాం’ అని చెప్పుకొచ్చాడు. కానీ ఆచార్య సినిమాను ఖచ్చితంగా హిందీలో రిలీజ్ చేస్తామని, తన పాత్రకు తానే స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పుకుంటానని చరణ్ పేర్కొన్నాడు. కానీ దీనికి కాస్తా సమయం పడుతుందని, దక్షిణాది భాషల్లో విడదుల అనంతరం హిందీ వెర్షన్‌పై దృష్టి పెడతామని, త్వరలోనే నార్త్‌లో ఆచార్య మూవీని రిలీజ్ చేస్తామని రామ్ చరణ్ స్పష్టం చేశాడు. కాగా ఆచార్య మూవీకి చరణ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment