ఖర్చు నబ్బే కరోడ్... ఫాయిదా 285.35 కోట్లు!
‘బాహుబలి–2’ హిందీ వెర్షన్ లెక్కల చిట్టా ఇది. థియేటర్లలో సినిమా ఇంకా బాగా ఆడుతోంది కనుక లాభం మరింత పెరిగే అవకాశముంది. ‘బాహుబలి–2’ హిందీ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 80కోట్లకు సొంతం చేసుకున్న కరణ్ జోహార్ పబ్లిసిటీకి ఓ 10 కోట్లు ఖర్చుపెట్టారట! మొత్తం ఖర్చు నబ్బే (90) కరోడ్. ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 375.35 కోట్లు కలెక్ట్ చేసింది.
అంటే నిర్మాతకు రూ. 285.35కోట్లు ఫాయిదా (లాభం). ఇంకో ఫాయిదా ఏంటంటే.. పన్నెండు కోట్లు కలెక్ట్ చేస్తే ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ ఇండియా (రూ. 387.38 కోట్లు) రికార్డును బీట్ చేసేస్తుంది. 12 కోట్లు ఏంటి? 25 కోట్లు కలెక్ట్ చేసి రూ. 400 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా (హిందీ నెట్)గా ‘బాహుబలి–2’ రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ నాడులో వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది.