నిర్ణయం నాదే | taapsee game over hindi version release | Sakshi
Sakshi News home page

నిర్ణయం నాదే

Jul 1 2019 12:52 AM | Updated on Jul 1 2019 12:56 AM

taapsee game over hindi version release - Sakshi

తాప్సీ

వరుస అవకాశాలతో బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు హీరోయిన్‌ తాప్సీ. అయినప్పటికీ ఏడాదికి సౌత్‌లో కనీసం ఒక్క సినిమా అయినా చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘గేమ్‌ ఓవర్‌’ చిత్రం నటిగా మరింత పేరు తెచ్చిపెట్టింది. ఆమె క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ని కూడా రిలీజ్‌ చేశారు. సౌత్‌లో సినిమాలు చేయడం గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘ప్రస్తుతం హిందీ సినిమాలతో కాస్త బిజీగా ఉన్నా ఏడాదికి సౌత్‌లో ఓ చిత్రంలో నటించేలా ప్లాన్‌ చేసుకుంటున్నాను.

మొదట్లో ‘ఓ పెద్ద హీరో డేట్స్‌ మా దగ్గర ఉన్నాయి.. మీ టు మంత్స్‌ డేట్స్‌ మాకు కావాలి’ అని నిర్మాతలు అడిగేవారు. కానీ, హిందీ సినిమాల కోసం ఆరు నెలల ముందే నా డేట్స్‌ బుక్కైపోయి ఉంటాయి. కానీ, ఇప్పుడు నేను నటిస్తున్న సౌత్‌ సినిమాల్లో నేనే ప్రధానపాత్రధారిగా ఉంటున్నాను. స్క్రిప్ట్‌ నచ్చితే నా నిర్ణయం ప్రకారం డేట్స్‌ని బట్టి సినిమాలు ప్లాన్‌ చేసుకుంటున్నాను’’ అని తాప్సీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement