Game Over Movie
-
ఆ పదానికి లింగ భేదం ఉండదు: తాప్సీ
ముంబై : తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందించే తాప్సీపై ఇటీవల నెటిజన్ తనపై చేసిన కామెంట్‌పై ఘాటుగా స్పందించి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ఢిల్లీ భామ తాజాగా మరో విషయంపై స్పందించారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘గేమ్ ఓవర్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన తాప్సీ వెండితెరపై ‘హీరో’ అన్న పదానికి కేవలం పురుష నటుడిగా మాత్రమే సమాజం భావిస్తోందని, నిజానికి హీరో అన్న పదానికి లింగ భేదం ఉండదని పేర్కొన్నారు. ఈ ధోరణిలో మార్పు తీసురావడమే తన లక్ష్యమని, నెమ్మదిగా ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలను అటు ఇండస్ట్రీతోపాటు ఇటు అభిమానులు అంగీకరించినప్పుడే ఈ మార్పు సాధ్యమవుతుందని, ప్రస్తుతం మార్పు రావాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. మహిళలకు, పురుషులకు మధ్య ఉన్న వ్యత్యాసం తొలగినప్పుడే అందరి సినిమాలు సరిగా ఆదరించబడతాయని తెలిపారు. ఈ మార్పు ఏక కాలంలో వచ్చేది కాదని..ఇందుకోసం నటీమణులు కృషి చేయాలని ఆమె కోరారు. ఇక ఈ ఏడాది తాప్సీ బద్లా, గేమ్ ఓవర్ రెండు చిత్రాలు విడుదలకాగా బద్లా సినిమా రూ. 100 కోట్ల మేర వసూళ్లు సాధించగా, గేమ్ ఓవర్ విమర్శకుల ప్రశంసలు పొందినా వసూళ్లలో వెనుకబడిన సంగతి తెలిసిందే. తాప్పీ నటించిన తాజా సినిమాలు మిషన్ మంగళ్, సాంద్ కి ఆంఖ్.. రెండు చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. -
నిర్ణయం నాదే
వరుస అవకాశాలతో బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు హీరోయిన్ తాప్సీ. అయినప్పటికీ ఏడాదికి సౌత్‌లో కనీసం ఒక్క సినిమా అయినా చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘గేమ్ ఓవర్’ చిత్రం నటిగా మరింత పేరు తెచ్చిపెట్టింది. ఆమె క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ని కూడా రిలీజ్ చేశారు. సౌత్‌లో సినిమాలు చేయడం గురించి తాప్సీ మాట్లాడుతూ –‘‘ప్రస్తుతం హిందీ సినిమాలతో కాస్త బిజీగా ఉన్నా ఏడాదికి సౌత్‌లో ఓ చిత్రంలో నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాను. మొదట్లో ‘ఓ పెద్ద హీరో డేట్స్ మా దగ్గర ఉన్నాయి.. మీ టు మంత్స్ డేట్స్ మాకు కావాలి’ అని నిర్మాతలు అడిగేవారు. కానీ, హిందీ సినిమాల కోసం ఆరు నెలల ముందే నా డేట్స్ బుక్కైపోయి ఉంటాయి. కానీ, ఇప్పుడు నేను నటిస్తున్న సౌత్ సినిమాల్లో నేనే ప్రధానపాత్రధారిగా ఉంటున్నాను. స్క్రిప్ట్ నచ్చితే నా నిర్ణయం ప్రకారం డేట్స్‌ని బట్టి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాను’’ అని తాప్సీ అన్నారు. -
మా బాధ్యత పెరిగింది
‘‘గేమ్ ఓవర్’ విజయంతో మా సంస్థపై బాధ్యత మరింతగా పెరిగింది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయం వారిదే’’ అని నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర అన్నారు. తాప్సి లీడ్ రోల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఓవర్’. తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్టూడియోస్’ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ– ‘‘మా సంస్థ గతంలో తెలుగులో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్, గురు’ చిత్రాల విజయాల సరసన ‘గేమ్ ఓవర్’ నిలిచింది. మూడు భాషల్లో సినిమా విజయం సాధించింది. విజయోత్సవ వేడుకలు ఒకేచోట నిర్వహించనున్నాం’’ అన్నారు. ‘‘గేమ్ ఓవర్’ ప్రేక్షకులకు ఓ సరికొత్త థ్రిల్లింగ్‌ను కలిగిస్తుందని విడుదలకు ముందు చెప్పాను.. ఇప్పుడు ఆ మాట నిజమైంది’’ అన్నారు తాప్సీ. ‘‘గేమ్ ఓవర్’ సినిమా తెలుగులో నాకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది’’ అని అశ్విన్ శరవణన్ అన్నారు. -
‘గేమ్ ఓవర్’ మూవీ రివ్యూ
టైటిల్ : గేమ్ ఓవర్ జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ తారాగణం : తాప్సీ, వినోదిని వైద్యనాథన్, అనీష్ కురివిల్లా, సంగీతం : రాన్ ఏతాన్ యోహన్ దర్శకత్వం : అశ్విన్ శరవణన్ నిర్మాత : ఎస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తాప్సీ ఇక్కడ సరైన సక్సెస్‌లు రాకపోవటంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టారు. బాలీవుడ్లో బేబీ, పింక్, నామ్ షబానా లాంటి సక్సెస్‌ల తరువాత తిరిగి సౌత్‌లో సక్సెస్కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగు ఆనందో బ్రహ్మాతో సక్సెస్ సాధించిన ఈ బ్యూటి ప్రస్తుతం గేమ్ ఓవర్ అనే ఇంటెన్స్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయనతార ప్రధాన పాత్రలో మాయ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ శరవణన్.. గేమ్ ఓవర్‌ను తెరకెక్కించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాతో సౌత్‌లోనూ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నారు తాప్సీ. మరి గేమ్ ఓవర్ తాప్సీ ఆశించిన సక్సెస్ ఇచ్చిందా..? కథ : అమృత (సంచన నటరాజన్) అనే అమ్మాయిని ఓ హంతకుడు కిరాతకంగా చంపే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. అమృతను తాళ్లతో కట్టేసిన తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ తొడిగి ఊపిరాడకుండా చేసిన హంతకుడు తరువాత ఆమె బాడీని నరికి తగులబెడతాడు. స్వప్న (తాప్సీ పన్ను) వీడియో గేమ్ డిజైనర్. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ సమస్య కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసి గాయపడుతుంది. ఈ సంఘటన తరువాత పరిణామాలు స్వప్న జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? స్వప్న జీవితంతో అమృతకి సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు : లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెట్టిన తాప్సీ గేమ్ ఓవర్ సినిమాతో సౌత్‌లో సక్సెస్ కోసం ప్రయత్నించారు. స్వప్న పాత్రకు తనదైన నటనతో ప్రాణంపోశారు. లుక్, యాక్షన్, ఎమోషన్స్ ఇలా ప్రతీ విషయంలో పర్ఫెక్షన్ చూపించిన తాప్సీ సినిమాను తన భుజాల మీదే నడిపించారు. మరో కీలక పాత్రలో నటించిన వినోదిని వైద్యనాథన్ కలమ్మ పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో అనీష్ కురివిల్లా, రమ్య సుబ్రమణ్యం, సంచన నటరాజన్ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : దర్శకుడు అశ్విన్ శరవణన్, రచయిత కావ్య గేమ్ సినిమాను ఓ వీడియో గేమ్ లాగే మలిచారు. సెన్సిబుల్ ఇష్యూస్‌ను టచ్ చేస్తూనే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించారు. అశ్విన్, కావ్యలు అందించిన స్క్రీన్‌ప్లేనే సినిమాకు ప్రధాన బలం. ఎంచుకున్న కథ చిన్న పాయింట్ కావడంతో.. ఫస్ట్ హాఫ్‌లో కథ ఏమీ లేదన్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో ఆసక్తికరంగా ఉంది అనుకునేలోపే సినిమా ముగుస్తుంది. సెకండాఫ్ అంతా కలలోనే నడుస్తుందా? లేక నిజమా అన్న కన్ఫ్యూజన్లో నడుస్తుంది. సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో పాటు పారానార్మల్, హర్రర్ ఎలిమెంట్స్‌ను కూడా జోడించారు. కమర్షియల్ ఫార్ములా అంటూ సాంగ్స్, కామెడీ ఇరికించకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించటం ఆకట్టుకుంది. సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫి, వినోద్ కెమెరా వర్క్, రాన్ ఏతాన్ యోహన్ మ్యూజిక్ ప్రతీ సీన్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చాయి. ప్లస్ పాయింట్స్ : తాప్సీ స్క్రీన్‌ప్లే మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్ - సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి
‘‘ప్రేక్షకులు 200–300 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని రెండు మూడు గంటలు సమయాన్ని వెచ్చించి నా సినిమా చూస్తున్నారు. అలాంటప్పుడు వారిని మెప్పించేలా నా చిత్రాలు ఉండాలి. లేకుంటే వారి డబ్బు, సమయం వృథా. డబ్బు సంపాదించుకోవచ్చు.. కానీ సమయం తిరిగి రాదు.. అందుకే మంచి కథలు ఎంచుకుంటున్నా’’ అని తాప్సీ అన్నారు. ఆమె లీడ్ రోల్లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఓవర్’. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో తాప్సీ పంచుకున్న విశేషాలు... ఈ సినిమాలో వీల్ చైర్ లో కూర్చొని నటించారు కదా ఎలా అనిపించింది? అవునండీ.. నా లైఫ్ లో ఇప్పటివరకూ ఎలాంటి ఫ్రాక్చర్ జరగలేదు. రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయి వీల్ ఛైర్లో కూర్చొవడం, నా జీవితంలో ఎప్పుడూ అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. 60 పర్సెంట్ ఈ సినిమాలో నేను వీల్ చైర్లో ఉంటాను. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా డిమాండ్ ఉన్న రోల్ ఇది. యాక్సిడెంట్ జరిగిన ఒక సంవత్సరానికి, మళ్లీ యానివర్సిరీ రియాక్షన్ స్టార్ట్ అయ్యే ఒక ట్రోమా సమస్యతో బాధపడే క్యారెక్టర్. ఆ యాక్సిడెంట్ ఏంటో మీరు సినిమాలో చూడాల్సిందే. ఏ లాంగ్వెజ్ లో అయినా సినిమాను మీ భుజాలపైనే వేసుకుంటున్నారు. ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా..? (నవ్వుతూ)నిజానికి ఆప్షన్స్ దొరకలేదు. ఇలాంటి స్టోరీలే దొరికాయి కాబట్టి, నేనే నా భుజాలపై మోయాల్సి వస్తుంది. నాకు కూడా ఈ కథలు నచ్చాయి. మా డైరెక్టర్స్ కూడా చాలా బ్రిలియంట్. వాళ్లే నాకు హీరోలు. వాళ్లే అసలైన కెప్టెన్స్. నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కానీ.. షూటింగ్ లో ఉన్నప్పుడు కానీ.. సోలో హీరోయిన్ అని.. ప్రెజర్ ఎక్కువ ఉంటుందని.. నేనెప్పుడూ ఆలోచించలేదు. కానీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు తాప్సీ ఇన్ గేమ్ ఓవర్ అని వార్తలు వచ్చాయి. అప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ నా పేరు పోస్టర్లో రాలేదు. హిందీలో నామ్ షబానా అనే టైటిల్ రోల్ చేసినా కూడా అక్కడ పోస్టర్లో పేరు వేయలేదు. ఇది మాత్రం చాలా స్కేరీగా ఉంది. ఇప్పటి వరకూ నేను త్రీ లాంగ్వెజెస్‌లో చేశాను. చాలా లక్కీ.. కానీ నాకు ఇది అసలైన టెస్ట్, కొంచెం నెర్వస్ గా ఉంది. ఒక స్క్రిప్ట్ ను మీరు ఎంపిక చేసుకునేప్పుడు ఏం చూస్తారు? కెరీల్ స్టార్టింగ్‌లో అసలు సినిమా అంటే ఏంటీ.. నటన అంటే ఏంటీ నాకు నిజంగా తెలీదు. నేర్చుకోవాలని ఉండేది.. కానీ ఎలాగో తెలిసేది కాదు. చిన్నచిన్నగా నేర్చుకోవడం మొదలుపెట్టాను. చేసిన తప్పులు మరోసారి చేయకుండా చూసుకునేదాన్ని. ఇప్పుడు స్క్రిప్ట్ విని డిసైడ్ చేసుకోగలుగుతున్నా. స్క్రిప్ట్ విన్న ప్పుడు ఆడియన్స్ పెట్టే డబ్బుకు నేను న్యాయం చేయగలుగుతానా, నా కథ నచ్చుతుందా అని ఆలోచిస్తాను. వాళ్లు పెట్టే డబ్బుకు, టైమ్ కు నా సినిమా నచ్చుతుందా అని ఆలోచిస్తున్నాను. మీరు రియల్ లైఫ్ లో వీడియో గేమ్స్ ఆడుతారా? ఆడేదాన్ని.. స్కూల్, కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు మారియో, బాట్ మాన్, కాంట్రా ఆడేదాన్ని. ఆ తరువాత ఆడలేదు. బద్లా సినిమా 100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. మీరు ఆడియన్స్‌లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారని అనుకోవడంలేదా? అవును.. నా నుండి మంచి సినిమాలు రావాలని ఆడియన్స్ కూడా కోరుకోవాలనుకుంటాను. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కిక్ ఏముంటుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాలు తీసి మాత్రం ఉపయోగం ఏముంది. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటే ఏం చెప్తాం. మ్యాగ్జిమమ్ నా సినిమా అంత కలెక్ట్ చేయాలని ట్రై చేస్తా.. కానీ బద్లా బిగ్ సర్ ప్రైజ్ అందరికీ. ఇంత కలెక్ట్ చేస్తుందని కూడా అనుకోలేదు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆడియన్స్ ఏదో నవ్వుకోడానికో, ఏదో పాటల కోసమో రారు. థ్రిల్ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారు. అయితే మనం వాళ్లను స్టోరీతో ఎంత ఎంగేజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. గేమ్ ఓవర్ అలాంటిదే.. ఈ సినిమాలో సింగిల్ క్యారెక్టర్ కదా.. ఒక్క క్యారెక్టర్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించడం లేదా? ఒక యాక్టర్‌కు ఇది నిజంగా పరీక్ష లాంటిది. 95 పర్సెంట్ నన్నే చూడాలి ఈ సినిమాలో మీరు.. నా పెర్ఫామెన్స్ తో మీరు రెండు గంటలు సినిమా చూడాలి. మీకు ఆప్షన్ లేదు.. ఇది నాకు టెస్ట్ లాంటిది. హిందీలో సాండ్ కీ ఆంఖ్ చేస్తున్నట్టున్నారు? ఆ రోల్ ను ఒప్పుకోవడానికి డిఫరెంట్ రోల్స్ చేయాలన్న భావనే కారణమా? డిఫరెంట్ రోల్ అండ్ టూ హీరోయిన్ ఒరియంటెడ్ సినిమా కోసం చూస్తున్నాను.. ఆ టైంలో సాండ్ కీ ఆంఖ్ దొరికింది. 65 ఇయర్ ఓల్డ్ గెటప్ లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం అందుకే ఈ స్టోరీ నా దగ్గరకు వచ్చిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. మీరు ఇప్పుడు మంచి ఫేజ్ లో ఉన్నారు.. ఇయర్‌కు 3 నుండి 4 సినిమాలు అది కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ సినిమాలు ఎంపిక చేసుకోవడం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..? దేవుని దయ వల్ల నా దగ్గరకు మంచి స్టోరీలే వచ్చాయి.. సో కథలు సెలక్ట్ చేసుకోవడం పెద్దగా కష్టం అనిపించలేదు. సో హ్యాపీగా ఇయర్ కి మూడు నాలుగు సినిమాలు సెలక్ట్ చేసుకొని, వర్క్ చేసుకుంటూ వెళ్లిపోవడమే. కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ నాకు ఇయర్ కు మూడు నాలుగు సినిమాలు చేయడం ఇష్టం. అక్షయ్ కుమార్ తో వర్క్ చేశారు కదా.. ఆ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..? అక్షయ్ సార్ సాధించిన దాంట్లో సగం సాధించినా చాలు నేను రిటైర్ అవ్వొచ్చు (నవ్వుతూ) రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ మిస్ అవుతున్నారా..? ఎక్కువ కాదు... కొంచెం మిస్ అవుతున్నా. కమర్షియల్ మూవీ డెఫినేషన్ మారిపోయింది. మంచి స్టోరీ ఉన్న మూవీ వస్తే గ్లామరస్ రోల్ చేయొచ్చు. కానీ స్టోరీ కూడా ఉండాలి.. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటి..? తమిళ్ లో ఒక సినిమా ఫైనల్ అయింది. గేమ్ ఓవర్ రిలీజ్ తరువాత ఆ సినిమా ప్రారంభం కానుంది. తెలుగులో రెండు మూడు స్టోరీలు విన్నా ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ సంవత్సరానికి ఒక సినిమా మాత్రం పక్కా తీస్తా. అశ్విన్ శరవనన్ ఈ సినిమాను హ్యాండిల్ చేస్తాడని మీకు అంత నమ్మకం ఎలా కలిగి ఈ స్టోరీ ఒప్పుకున్నారు..? మయూరి సినిమా చూశారా..? ఈ సినిమా మొత్తం ఒకేసారి చూడలేదు... నాకు చాలా భయం. పార్ట్ పార్ట్‌లుగా చూశాను. తను చాలా బ్రిలియంట్.. రైటింగ్ స్కిల్స్ కూడా సూపర్.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మాయ చూడలేదు. కానీ స్టోరీ చదివాను.. చదివిన దానికంటే సినిమా చాలా బెటర్ ఉంది. అందుకే తనపై నమ్మకంతోనే సినిమా చేశా.. మిమ్మల్ని డైరెక్టర్స్ యాక్ట్రెస్ అని అనొచ్చా..? తప్పకుండా నేను డైరెక్టర్స్ యాక్ట్రెస్నే, వారు నాకు చాలా బిగ్గెస్ట్ సపోర్టింగ్ సిస్టమ్ లాంటి వాళ్లు. నా కెరీర్లో నేను ఎదగడానికి చాలా హెల్ప్ చేసినవాళ్లు, నేను ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నానంటే వాళ్లే కారణం. పెళ్లి చేసుకునే ప్లాన్స్ ఇప్పుడేమైనా ఉన్నాయా? ఇప్పుడైతే లేవండి.. ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను. -
హీరోయిన్ తాప్సీకి ఏమైంది..?
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గేమ్ ఓవర్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సౌత్‌లో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్న తాప్సీ, ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటున్నారు. మీడియా ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియాలోనూ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. వరుసగా ఆన్‌లోకేషన్‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలను పోస్ట్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా తాప్సీ ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. తీవ్రంగా గాయాలైన చేతి ఫోటోతో పాటు రెండు కాళ్లకు కట్లు ఉన్న ఫోటోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు తాప్సీ. ‘మంచుతో కప్పబడిన కొండ ప్రాంతంలో 25 రోజుల పాటు షిఫాన్ సారీతో షూటింగ్ కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను’ అంటూ కామెంట్ చేశారు. వీడియో గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాప్సీ ఎక్కువ భాగం వీల్‌చైర్‌లోనే కనిపించనున్నారు. అందుకోసం ఎంతో ట్రైనింగ్ తీసుకొని మరి ఈ సీన్స్ షూట్ చేసినట్టుగా వెల్లడించారు తాప్సీ. అశ్విన్ శరవణన్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. Yes yes, chiffon sarees in snow capped mountains for 25 days would’ve been tougher... so I choose all this 🤷🏻♀️#GameOver #ActorsLife pic.twitter.com/wypIZXjHNy — taapsee pannu (@taapsee) 9 June 2019