Game Over Movie Review, in Telugu | ‘గేమ్‌ ఓవర్’ మూవీ రివ్యూ | Taapsee Pannu - Sakshi
Sakshi News home page

‘గేమ్‌ ఓవర్’ మూవీ రివ్యూ

Published Fri, Jun 14 2019 11:19 AM | Last Updated on Fri, Jun 14 2019 11:42 AM

Game Over Telugu Movie Review - Sakshi

టైటిల్ : గేమ్‌ ఓవర్‌
జానర్ : సస్పెన్స్‌ థ్రిల్లర్‌
తారాగణం : తాప్సీ, వినోదిని వైద్యనాథన్‌, అనీష్ కురివిల్లా, 
సంగీతం : రాన్ ఏతాన్ యోహన్
దర్శకత్వం : అశ్విన్‌ శరవణన్‌
నిర్మాత : ఎస్. శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర

తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తాప్సీ ఇక్కడ సరైన సక్సెస్‌లు రాకపోవటంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టారు. బాలీవుడ్‌లో బేబీ, పింక్‌, నామ్‌ షబానా లాంటి సక్సెస్‌ల తరువాత తిరిగి సౌత్‌లో సక్సెస్‌కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగు ఆనందో బ్రహ్మాతో సక్సెస్‌ సాధించిన ఈ బ్యూటి ప్రస్తుతం గేమ్‌ ఓవర్‌ అనే ఇంటెన్స్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నయనతార ప్రధాన పాత్రలో మాయ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్‌ శరవణన్‌.. గేమ్‌ ఓవర్‌ను తెరకెక్కించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాతో సౌత్‌లోనూ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నారు తాప్సీ. మరి గేమ్‌ ఓవర్‌ తాప్సీ ఆశించిన సక్సెస్‌ ఇచ్చిందా..?

కథ :
అమృత (సంచన నటరాజన్‌) అనే అమ్మాయిని ఓ హంతకుడు కిరాతకంగా చంపే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. అమృతను తాళ్లతో కట్టేసిన తన ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ తొడిగి ఊపిరాడకుండా చేసిన హంతకుడు తరువాత ఆమె బాడీని నరికి తగులబెడతాడు.

స్వప్న (తాప్సీ పన్ను) వీడియో గేమ్ డిజైనర్‌. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ సమస్య కారణంగా ఆత్మహత్య ప్రయత్నం చేసి గాయపడుతుంది. ఈ సంఘటన తరువాత పరిణామాలు స్వప్న జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? స్వప్న జీవితంతో అమృతకి సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
లేడీ ఓరియంటెడ్‌ సినిమాల మీద దృష్టి పెట్టిన తాప్సీ గేమ్‌ ఓవర్ సినిమాతో సౌత్‌లో సక్సెస్‌ కోసం ప్రయత్నించారు. స్వప్న పాత్రకు తనదైన నటనతో ప్రాణంపోశారు. లుక్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌ ఇలా ప్రతీ విషయంలో పర్ఫెక్షన్‌ చూపించిన తాప్సీ సినిమాను తన భుజాల మీదే నడిపించారు. మరో కీలక పాత్రలో నటించిన వినోదిని వైద్యనాథన్‌ కలమ్మ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యారు. నేచురల్‌ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో అనీష్‌ కురివిల్లా, రమ్య సుబ్రమణ్యం, సంచన నటరాజన్‌ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :
దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌, రచయిత కావ్య గేమ్‌ సినిమాను ఓ వీడియో గేమ్‌ లాగే మలిచారు. సెన్సిబుల్‌ ఇ‍ష్యూస్‌ను టచ్‌ చేస్తూనే థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కలిగించారు. అశ్విన్‌, కావ్యలు అందించిన స్క్రీన్‌ప్లేనే సినిమాకు ప్రధాన బలం. ఎంచుకున్న కథ చిన్న పాయింట్ కావడంతో.. ఫస్ట్ హాఫ్‌లో కథ ఏమీ లేదన్న ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌లో ఆసక్తికరంగా ఉంది అనుకునేలోపే సినిమా ముగుస్తుంది. సెకండాఫ్‌ అంతా కలలోనే నడుస్తుందా? లేక నిజమా అన్న కన్‌ఫ్యూజన్‌లో నడుస్తుంది.

సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో పాటు పారానార్మల్‌, హర్రర్‌ ఎలిమెంట్స్‌ను కూడా జోడించారు. కమర్షియల్‌ ఫార్ములా అంటూ సాంగ్స్‌, కామెడీ ఇరికించకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించటం ఆకట్టుకుంది.  సినిమాకు ప్రధాన బలం సినిమాటోగ్రఫి, వినోద్‌ కెమెరా వర్క్‌, రాన్ ఏతాన్ యోహన్ మ్యూజిక్‌ ప్రతీ సీన్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చాయి. 

ప్లస్‌ పాయింట్స్‌ :
తాప్సీ
స్క్రీన్‌ప్లే

మైనస్‌ పాయింట్స్‌ :
ఫస్ట్‌ హాఫ్‌
స్లో నెరేషన్‌

- సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement