హీరోయిన్‌ తాప‍్సీకి ఏమైంది..? | Game Over Actress Taapsee Pannu Tweet Viral | Sakshi
Sakshi News home page

తాప్సీకి ఏమైంది..?

Published Sun, Jun 9 2019 9:56 AM | Last Updated on Sun, Jun 9 2019 3:45 PM

Game Over Actress Taapsee Pannu Tweet Viral - Sakshi

ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గేమ్‌ ఓవర్‌. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సౌత్‌లో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్న తాప్సీ, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటున్నారు. మీడియా ఇంటర్వ్యూలతో పాటు సోషల్ మీడియాలోనూ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

వరుసగా ఆన్‌లోకేషన్‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలను పోస్ట్ చేస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా తాప్సీ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్‌ గా మారింది. తీవ్రంగా గాయాలైన చేతి ఫోటోతో పాటు రెండు కాళ్లకు కట్లు ఉన్న ఫోటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు తాప్సీ. ‘మంచుతో కప్పబడిన కొండ ప్రాంతంలో 25 రోజుల పాటు షిఫాన్‌ సారీతో షూటింగ్ కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను’ అం‍టూ కామెంట్ చేశారు.

వీడియో గేమ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాప్సీ ఎక్కువ భాగం వీల్‌చైర్‌లోనే కనిపించనున్నారు. అందుకోసం ఎంతో ట్రైనింగ్ తీసుకొని మరి ఈ సీన్స్‌ షూట్ చేసినట్టుగా వెల్లడించారు తాప్సీ. అశ్విన్‌ శరవణన్‌ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement