
తాప్సి
‘‘గేమ్ ఓవర్’ విజయంతో మా సంస్థపై బాధ్యత మరింతగా పెరిగింది. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయం వారిదే’’ అని నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర అన్నారు. తాప్సి లీడ్ రోల్‌లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఓవర్’. తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్టూడియోస్’ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది.
ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ– ‘‘మా సంస్థ గతంలో తెలుగులో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్, గురు’ చిత్రాల విజయాల సరసన ‘గేమ్ ఓవర్’ నిలిచింది. మూడు భాషల్లో సినిమా విజయం సాధించింది. విజయోత్సవ వేడుకలు ఒకేచోట నిర్వహించనున్నాం’’ అన్నారు. ‘‘గేమ్ ఓవర్’ ప్రేక్షకులకు ఓ సరికొత్త థ్రిల్లింగ్‌ను కలిగిస్తుందని విడుదలకు ముందు చెప్పాను.. ఇప్పుడు ఆ మాట నిజమైంది’’ అన్నారు తాప్సీ. ‘‘గేమ్ ఓవర్’ సినిమా తెలుగులో నాకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది’’ అని అశ్విన్ శరవణన్ అన్నారు.