VoiceOver
-
అర్జున్‌కి కనెక్ట్ అయ్యా!
‘‘ఓపెన్ చేస్తే వైజాగ్‌లో అందమైన ఇల్లు...’’ అంటూ నాగచైతన్య ఇచ్చిన వాయిస్ ఓవర్‌తో మొదలైంది ‘డియర్’ చిత్రం ట్రైలర్. జీవీ ప్రకాశ్‌కుమార్, ఐశ్వర్యా రాజేశ్ నటించిన చిత్రం ‘డియర్’. తమిళంలో ఈ నెల 11న, తెలుగులో 12న ఈ చిత్రం విడుదల కానుంది. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి. పృథ్వీరాజ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంధ్రాలో అన్నపూర్ణ స్టూడియోస్, తెలంగాణలో ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. భార్య (ఐశ్వర్యా రాజేశ్) గురక కారణంగా భర్త (జీవీ ప్రకాశ్) సతమతమవుతుంటాడు. ఆ గురక కారణంగా వారి అనుబంధంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది ‘డియర్’ కథాంశం. ‘‘ఈ ప్రపంచంలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? రాత్రిపూట మంచి నిద్ర. ఈ కథను (‘డియర్’కి ఇచ్చిన వాయిస్ ఓవర్‌ని ఉద్దేశించి) నెరేట్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్ (జీవీ ప్రకాశ్ పాత్ర) భయానికి నేను కనెక్ట్ అయ్యాను. మీరూ కనెక్ట్ అవుతారనుకుంటున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో ‘డియర్’ ట్రైలర్‌ని షేర్ చేశారు నాగచైతన్య. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. -
విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథను టూకీగా చెప్పిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan Voice Over To Movie: విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ఎలా ఉంటుందో అమితాబ్ బచ్చన్ టూకీగా చెప్పారు. విక్రమాదిత్య అంటే ప్రభాస్, ప్రేరణ అంటే పూజా హెగ్డే అనే విషయం ‘రాధేశ్యామ్’ సినిమా అప్డేట్స్ని ఫాలో అవుతున్నవారికి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ఈ ఇద్దరూ చేసిన పాత్రల పేర్లివి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన చిత్రం ‘రాధేశ్యామ్’. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో 1970ల్లో జరిగే ప్రేమకథతో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న విడుదల కానుంది. చదవండి: Allu Arjun Expensive Things: వావ్.. అల్లు అర్జున్ కొత్త ఇల్లు అదిరిందిగా.. ఎన్ని కోట్లు పెట్టాడంటే.. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్‌కు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని మంగళవారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నెరేషన్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుంది. బిగ్ బీకి ధన్యవాదాలు’’ అని చిత్రబృందం పేర్కొంది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ), కెమెరా: మనోజ్ పరమహంస. Thank you Shahenshah @SrBachchan sir for the Hindi voiceover of #RadheShyam. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamOnMarch11 pic.twitter.com/xrqZWGXoj1 — Radha Krishna Kumar (@director_radhaa) February 22, 2022 -
చోప్రా సిస్టర్స్ మాట సాయం
ఇటీవల హాలీవుడ్ సినిమాలను మన ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రాంత సూపర్ స్టార్స్‌తోనూ ప్రమోట్ చేయిస్తున్నాయి ఆ చిత్ర నిర్మాణ సంస్థలు. తాజాగా తమ కొత్త యానిమేషన్ చిత్రం ‘ఫ్రాజెన్ 2’ను కూడా అదే స్టయిల్లో ప్రమోట్ చేస్తోంది డిస్నీ సంస్థ. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్’ ముఖ్యాంశం. హిందీ వెర్షన్లో ఈ పాత్రలకు చోప్రా సిస్టర్స్ (ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా) వాయిస్ ఓవర్ అందించనున్నారు. ‘‘మిమి, తిషా (ప్రియాంక, పరిణితీ ముద్దు పేర్లు) ఇప్పుడు ఎల్సా, అన్నా కాబోతున్నారు. ఇలాంటి అద్భుతమైన, ధైర్యవంతమైన పాత్రలకు మా వాయిస్‌ను అందించడం ఆనం దంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది. -
నెటిజన్లకి అంధుల విజ్ఞప్తి
ఓ మంచి పనికి సహకారం కావాలని, తమకు నెటిజన్లు అండగా నిలవాలని కోరుతూ అంధులు విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అంధులు ఎదుర్కొంటున్న ఓ సమస్యను, అందరం కలిస్తే చాలా సులువుగా పరిష్కరించవచ్చు. ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా మన చేతిలో ఉన్నట్టే. ఈ స్మార్ట్ ఫోన్‌ని కళ్లు మూసుకొని కూడా కొన్ని సాఫ్ట్వేర్ల సహాయంతో అవలీలగా ఉపయోగించవచ్చు. వీటిలో వాయిస్ ఓవర్ అనే స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ ఒకటి. ఇది ప్రతి ఆపిల్ ఐఓస్ ప్రాడక్ట్‌లలో అందుబాటులో ఉంది. ఈ వాయిస్ ఆఫ్షన్‌ని ఆన్ చేస్తే స్క్రీన్ మీద కనిపించే ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని స్పష్టంగా పైకి చదివి వినిపిస్తుంది. దీని సహాయంతో అంధత్వాన్ని అతిక్రమించి ఇతరుల మీద ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకుంటూ వ్యక్తిగత జీవితంలో ఉద్యోగ రంగంలో అంధులు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అంధులు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడానికి తెలుగు వారందరి సహకారాన్ని కోరుతున్నారు. ఈ వాయిస్ ఓవర్ సహాయంతో కొన్ని ప్రాంతీయ భాషల్లో లభించే సమాచారాన్ని అంధులు చదవలేకపోతున్నారు. వీటిలో తెలుగు భాష కూడా ఉంది. దీంతో స్క్రీన్ పైన కనిపించే తెలుగు పదాలను అంధులు చదవలేకపోతున్నారు. చేంజ్ డాట్ ఓఆర్జీ వెబ్ సైట్ సహాయంతో తమ సమస్యను ఆపిల్ దృష్టికి తీసుకువెళ్లడానికి అంధులు ఓ దరఖాస్తు చేశారు. అయితే ఈ పిటిషన్ ఆపిల్ స్వీకరించాలంటే కనీసం 5000 మంది ఈ పిటిషన్‌కు మద్దతుగా సైన్ చేయాల్సి ఉంటుంది. మద్దతు తెలపడానికి కేవలం అంధులే కావాల్సిన అవసరం లేదు. వారి సమస్యకు పరిష్కారం అవసరం అని భావించే ఎవరైనా ఈ పిటిషన్‌కు మద్దతు తెలిపి అంధుల ఆత్మస్థైర్యానికి అండగా నిలిచే అవకాశం ఉంది. కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి మొదటిపేరు, చివరి పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి సైన్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. https://www.change.org/p/apple-appeal-to-add-telugu-text-to-speech-for-blind-to-read-telugu-in-voice-over?recruiter=770398474&utm_source=share_petition&utm_medium=sms&utm_campaign=share_petition&utm_term=share_petition మరింత సమాచారం కోసం కింది వీడియోను వీక్షించండి