Riddhi Kumar: రాధేశ్యామ్‌ కోసం విలువిద్య నేర్చుకున్నా | Riddhi Kumar Talk About Prabhas Radhe Shyam Movie | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్, బన్నీ, విజయ్‌ దేవరకొండతో నటించాలని ఉంది : రాధేశ్యామ్‌ భామ

Published Sat, Mar 5 2022 8:18 AM | Last Updated on Sat, Mar 5 2022 11:49 AM

Riddhi Kumar Talk About Prabhas Radhe Shyam Movie - Sakshi

‘రాధేశ్యామ్‌’ సినిమాలో స్పోర్ట్స్‌ ఉమన్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ పాత్ర చేయడం చాలా కష్టం. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఆర్చరీ (విలు విద్య) నేర్చుకున్నాను’’ అని నటి రిద్దీ కుమార్‌ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.

ఈ చిత్రంలో నటించిన రిద్దీ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది పుణే. మా నాన్న ఆర్మీ ఆఫీసర్‌. నేను పుణేలోనే ఫిలాసఫీలో డిగ్రీ చేశాను. సినిమాల్లో నటించాలనుకున్నప్పుడు ముందు  మోడలింగ్‌లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో చాన్స్‌ వచ్చింది. తెలుగులో ‘లవర్స్, అనగనగా ఓ ప్రేమకథ’ చిత్రంలో నటించాను. ఇంత తక్కువ సమయంలోనే ప్రభాస్‌ వంటి బిగ్‌ స్టార్‌తో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశాను. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. నేను నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ మేలో రిలీజ్‌ అవుతోంది. నటి రేవతి మేడమ్‌ దర్శకత్వంలో కాజోల్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తున్నాను. నాకు డిటెక్టివ్, ఫన్‌ క్యారెక్టర్స్‌ చేయాలని ఉంది. తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండ.. ఇలా అందరి హీరోలతో నటించాలని ఉంది’’ అన్నారు.  

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement