రాముడిగా కనిపించేందుకు బరువు తగ్గుతున్న ప్రభాస్!‌ | Prabhas Gym Exercises at Mumbai | Sakshi
Sakshi News home page

రాముడి పాత్ర కోసం కష్టపడుతున్న ప్రభాస్‌

Published Fri, Mar 19 2021 6:25 AM | Last Updated on Fri, Mar 19 2021 8:27 AM

Prabhas ‌Gym Exercises at Mumbai - Sakshi

ప్రభాస్‌ ఫుల్‌ బిజీ బిజీగా ఉంటున్నారు. ఆయన నటించిన ‘రాధేశ్యామ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సెట్స్‌లో ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఒకేసారి ఒక సినిమా చేసుకుంటూ వస్తున్న ప్రభాస్‌ ఇప్పుడు మాత్రం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’ సెట్స్‌కి తిరుగుతూ ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. హైదరాబాద్‌లో ‘సలార్‌’ షెడ్యూల్‌ పూర్తి చేసి, ‘ఆదిపురుష్‌’ కోసం ముంబయ్‌ వెళ్లారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ చేస్తున్న ఈ భారీ త్రీడీ మూవీ షెడ్యూల్‌ను ముంబయ్‌లో ప్లాన్‌ చేశారు.

ఒక భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్న విషయం తెలిసిందే. పాత్రకు తగ్గట్టుగా కొంచెం స్లిమ్‌ లుక్‌లో కనబడనున్నారు. అందుకోసం ముంబయ్‌లో రోజుకి ఉదయం, సాయంత్రం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. కొన్ని కిలోల బరువు తగ్గించే పని మీద ఉన్నారట. 2022 ఆగస్ట్‌ 11న ఈ చిత్రం విడుదల కానుంది.

చదవండి: మోహన్‌బాబు నవ్వించడంలోనూ దిట్ట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement