
విక్రమాదిత్యకు జరిగిన ప్రమాదం అతని ప్రేమకు పునాది వేసింది. ప్రేరణతో ప్రేమకు నాంది పలికింది. ఇంతకీ విక్రమాదిత్య, ప్రేరణ ఎవరు అనుకుంటున్నారా? ‘రాధే శ్యామ్’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రభాస్, పూజా హెగ్డే పేర్లే విక్రమాదిత్య, ప్రేరణ. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డాక్టర్ ప్రేరణ పాత్రలో కనిపిస్తారు పూజా హెగ్డే. ఓ ప్రమాదంలో గాయపడ్డ విక్రమాదిత్యకు హాస్పిటల్‌లో ప్రేరణ చికిత్స చేస్తుందట. అలా విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ మొదలవుతుందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment