Hero Prabhas Comments On Radhe Shyam Movie Results Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas: 'రాధేశ్యామ్' ఫలితంపై ప్రభాస్ షాకింగ్‌ కామెంట్స్‌..!

Published Wed, Apr 20 2022 12:07 AM | Last Updated on Wed, Apr 20 2022 11:34 AM

Prabhas Comments On Radhe Shyam Movie Results - Sakshi

'బాహుబలి' సిరీస్‌తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్‌ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఆ చాత్రాలు ఇచ్చిన విజయంతో అదే స్పీడ్లో వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన తన చిత్రం 'రాధే శ్యామ్' ఫలితంపై పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్ స్పందించాడు. ఇక ఇదే విషయంపై ప్రభాస్ మాట్లాడుతూ 'బాహుబలి' లాంటి సినిమాలు చేయడం నాకిష్టమే. అయితే ఎప్పుడూ అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తే తాను నటుడిగా కొత్తదనం చూడలేను. అలాగే పలు విభిన్నమైన చిత్రాల్లో నటించాలని నా కోరిక.

అవి చిన్న బడ్జెట్‌ చిత్రాలైనా నాకిష్టమే. ఇక 'రాధే శ్యామ్' విషయానికి వస్తే ఆ చిత్రం రిలీజ్ సమయానికి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే కారణం అనుకుంటున్నా. దాంతో పాటు నన్ను ప్రేమ కథల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు. లేదా ఆ స్క్రిప్టులోనే ఏదైనా లోపం కూడా ఉండి ఉండొచ్చు అంటూ ప్రభాస్ పేర్కొన్నాడు.

ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దాదాపు పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement