ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది : పూజా హెగ్డే | Pooja Hegde Wants To Act With Kamal Ranbir And Dhanush | Sakshi
Sakshi News home page

Pooja Hegde: ఆ స్టార్స్‌లో నటించాలనుకుంటున్న బుట్టబొమ్మ

Published Sat, Mar 5 2022 9:01 PM | Last Updated on Sat, Mar 5 2022 9:01 PM

Pooja Hegde Wants To Act With Kamal Ranbir And Dhanush - Sakshi

పూజా హెగ్డే ఇప్పుడు సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో గోల్డెన్‌ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. పూజ ఉంటే చాలు హిట్టు గ్యారెంటీ అన్నంతగా సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుండటంతో ఆమె అడిగినంత పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు వెనకాడటం లేదు. భారీ బడ్జెట్‌ సినిమాల్లో వరుస ఆఫర్లతో బిజీగా మారిన పూజా నటించిన రాధేశ్యామ్‌ ఈనెల 11న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూజా.. ఓ ఇంటర్వ్యూలో.. ఏ హీరోలతో నటించాలనుకుంటున్నారు అని అడగ్గా.. కమల్‌హాసన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ధనుష్‌లతో నటించాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే కోలీవుడ్‌లో బీస్ట్‌ మూవీతో ఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కానుంది. ఈ పొడుగు కాళ్ల సుందరి లక్‌ చూస్తుంటే త్వరలోనే ఆమె కోరిక తీరేలా కనిపిస్తుంది. చదవండి: పూజా హెగ్డేతో విబేధాలపై తొలిసారి స్పందించిన ప్రభాస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement