Radhe Shyam New Release Date: Prabhas Radhe Shyam Movie Release On 2022 Jan - Sakshi
Sakshi News home page

Rahde Shyam Update: సంక్రాంతికి రాధేశ్యామ్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగే

Published Fri, Jul 30 2021 10:35 AM | Last Updated on Fri, Jul 30 2021 11:27 AM

Prabhas Radhe Shyam Locks Sankranthi Race - Sakshi

Radhe Shyam New Release Date: బాహుబలి ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ఈ మాయదారి కరోనా లేకపోయుంటే చిత్రయూనిట్‌ ముందుగా చెప్పిన డేట్‌ ప్రకారం నేడు(జూలై 30న) ఈ సినిమా రిలీజ్‌ అయ్యుండేది. కానీ కరోనా ప్రభావం వల్ల షూటింగ్‌ ఆలస్యం అవడం, థియేటర్ల ఓపెనింగ్‌పై అస్పష్టత నెలకొనడం, ప్రేక్షకులు మళ్లీ మునుపటిలా థియేటర్లకు వస్తారా? లేదా? అన్న సందిగ్ధంలోనే సమయమంతా గడిచిపోయింది. దీంతో ప్రభాస్‌ అభిమానులు అసలు రాధేశ్యామ్‌ ఈ ఏడాది ఉంటుందా?లేదా? అని జుట్టు పీక్కుంటున్నారు.

వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ తాజాగా రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది చిత్రయూనిట్‌. ఈ ఏడాది కుదరదు కానీ సంక్రాంతి బరిలోకి దిగుతున్నామంటూ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పటికే సర్కారువారి పాటతో మహేశ్‌బాబు, భీమ్లానాయక్‌గా పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగుతున్నారు. తాజాగా ప్రభాస్‌ కూడా సంక్రాంతి పందెంకు సై అంటున్నాడు. ఇక యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్‌ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement