
Prabhas Radhe Shyam Movie Sanchari Full Song Out: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-పూజ హెగ్డే హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’. కె. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్, పాటలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.
చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్ సాంగ్‌పై మాధవిలత షాకింగ్ కామెంట్స్
ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు బయటకు రాగా తాజాగా 3వ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. సంచారి అంటూ సాగే ఈ పాట టీజర్‌ను ఇటీవల మేకర్స్ విడుదల చేయగా ఇందులో ప్రభాస్ లుక్‌కు విశేష స్సందన వచ్చింది. దీంతో ఫుల్ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మూవీ టీం సర్‌పైజ్ ఇచ్చింది. తాజాగా సంచారి పూర్తి సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో… చలో… సంచారి! చల్ చలో… చలో… కొత్త నేలపై’ అనే లిరిక్స్‌తో సాగే వీడియో సాంగ్‌ని విడుదల చేశారు.
చదవండి: పుష్పలో భుజం పైకెత్తి నటించడం వల్ల ఆ సర్జరీ ఎఫెక్ట్ చూపించింది: బన్నీ
ఇందులో ప్రభాస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. ఈ పాట విడుదలైన గంటలోనే యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్‌కు రీచ్ అవ్వడం విశేషం. అనిరుధ్ రవిచందర్ ఆలపించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించాడు. జస్టిన్ ప్రభాకరణ్ స్వరాలు సమకూర్చారు. కాగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. జనవరి 14న సంక్రాంతికి రాధే శ్యామ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.