
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజవబోతుందంటూ గత కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతుండగా అందులో నిజం లేదని కొట్టిపారేశారు మేకర్స్. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు రిసెంట్‌గా చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమా థియేటర్లలోనే మొదట రిలీజవబోతుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.
చదవండి: టాలీవుడ్ ప్రముఖుల మధ్య కోల్డ్‌వార్, వరస ట్వీట్స్‌తో మాటల యుద్ధం..
దీంతో తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూస్తామా? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాదాపు 350కోట్ల వరకు బడ్జెట్ అయిందట. అయితే ఈ సినిమాకు డిజిటల్ శాటిలైట్ హక్కులు భారీ డీల్‌కు కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను..
అన్ని భాషలకు కలుపుకుని దాదాపు రూ. 250కోట్ల భారీ ధరకు డీల్ కుదిరిందని సమాచారం. ఇదే నిజమైనతే రాధేశ్యామ్ నిర్మాతలకు ఇప్పటికే 70 శాతం రిటర్న్స్ వచ్చినట్టే అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావాల్సిన రాధేశ్యామ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడ్డటంతో మార్చి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment