
Radhe Shyam Pre Release Event On 23rd With Fans As Guest: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. కెకె రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. కాగా ఈ నెల 23న ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకకు అభిమానులే అతిథులుగా హాజరుకానున్నారు. 5 భాషలకు సంబంధించిన ఈ సినిమా ట్రైలర్స్‌ని ప్రభాస్ ఫ్యాన్స్ చేతులమీదుగా రిలీజ్ చేయనున్నారు. అభిమానులు కోవిడ్ నిబంధనలు పాటించి, ఈ వేడుకకు రావాలని చిత్రయూనిట్ పేర్కొంది.