
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. డార్లింగ్ పెళ్లి గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన ప్రభాస్ పెళ్లి అంటేనే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా 'రాధేశ్యామ్' చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభాస్.. ప్రేమ పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అయితే అది ఎప్పుడు అన్నదానిపై మాత్రం కశ్చితంగా చెప్పలేనని బదులిచ్చాడు. బాహుబలి సినిమా తర్వాత 5వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని అడగ్గా.. అవునని చెప్పిన డార్లింగ్ ఇదో పెద్ద కన్‌ఫ్యూజన్ అని అన్నారు.
ఇలాంటి పరిస్థితి మీకొస్తే ఏం చేస్తారంటూ సరదాగా అడిగాడు. ఇక మొత్తానికి పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రభాస్ ఎప్పుడన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ చిత్రం రేపు(మార్చి11)న విడుదలకు సిద్ధం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment