Teaser Of Radhe Shyam Will Be Released On Prabhas Birthday - Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ బర్త్‌డే: రాధే శ్యామ్‌ నుంచి రానున్న బిగ్‌ సర్‌ప్రైజ్‌

Published Thu, Oct 21 2021 9:00 AM | Last Updated on Thu, Oct 21 2021 11:52 AM

Radhe Shyam Teaser Release On Prabhas Birthday October 23rd - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌-పూజ హెగ్డే హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. ఈ సినిమాలోని విక్రమాదిత్య పాత్రను పరిచయం చేస్తూ ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్‌. 

చదవండి: మహేశ్‌ బాబును లాభాల బాట పట్టించిన ‘లవ్‌స్టోరీ

విక్రమాదిత్య ఎవరు? ఆయన కథేంటి అన్నది టీజర్‌ ద్వారా చూపించబోతున్నారు. అక్టోబర్‌ 23న ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉదయం 11:16 గంటలకు టీజర్‌ను వ విడుదల చేయబోతున్నట్లు నిన్న(బుధవారం) మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్వటర్‌లో ‘విక్రమాదిత్య ఎవరు?’ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రాధేశ్యామ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: Radhe Shyam : బాప్‌రే.. ఒక్క క్లైమాక్స్ కోసమే అన్ని కోట్లా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement