Prabhas reached to Hyderabad : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇటీవలె ఇటలీ ట్రిప్ ముగించుకున్న ఆయన బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రభాస్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్లజోడు సహా తలను బినీతో కంప్లీట్‌గా కవర్ చేసుకున్న ప్రభాస్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. అయితే ఆయన ఇటలీ ట్రిప్ రాధేశ్యామ్ షూటింగ్ కోసమా లేక వెకేషన్ ట్రిప్పా అన్నదానిపై స్పష్టత లేదు.
రాధాకృష్ణ దర్శకత్వంతో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. పిరియాడికల్ ప్రేమకథ తెరకెక్కుతున్న ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 23న హైదరాబాద్‌లో ఆరంభమై, ఆగస్టు 5 వరకు జరుగుతుందని సమాచారం. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ విడుదల కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో 'సలార్', దర్శకుడు ఓంరౌత్ తో 'ఆదిపురుష్' భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment