Is Prabhas Radhe Shyam Movie Release Date Confirmed? | కేజీఎఫ్‌ 2 తర్వాత రాధేశ్యామ్‌! - Sakshi
Sakshi News home page

Radhe Shyam: జూలై నెలాఖరున రిలీజ్‌!

Published Mon, Feb 8 2021 10:37 AM | Last Updated on Wed, Mar 3 2021 8:12 PM

Radhe Shyam Movie Release Date Locked - Sakshi

ఈ సినిమా విడుదల గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. జూలై 30న ప్రేక్షకులను అలరించేందుకు చిత్రయూనిట్‌ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంక్రాంతి పండగ అయిపోగానే సినిమాల రిలీజ్‌ డేట్స్‌ పండగ షురూ అయిన సంగతి తెలిసిందే.. చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్‌ సినిమాల వరకు అన్నీ పోలోమని వరుసగా విడుదల తేదీలు ప్రకటించాయి. ప్రభాస్‌ కూడా ఔం రౌత్‌ డైరెక్షన్‌లో చేస్తున్న "ఆదిపురుష్‌" సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు. వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లకు వస్తున్నట్లు తెలిపాడు. కానీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ 'రాధేశ్యామ్'‌ రిలీజ్‌ ఎప్పుడనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గా ఉంచాడు.

ఈ క్రమంలో ఈ సినిమా విడుదల గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. జూలై 30న ప్రేక్షకులను అలరించేందుకు చిత్రయూనిట్‌ రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కంటే ముందు, తర్వాత రెండు పెద్ద సినిమాలు రిలీజవబోతున్నాయి. జూలై 19న రాఖీ భాయ్‌ 'కేజీఎఫ్‌ 2', ఆగస్టు 13న అల్లు అర్జున్‌ 'పుష్ప' ప్రేక్షకుల ముందు వస్తున్నాయి. ఈ రెండింటితో ఢీ కొట్టకుండా ఉండేందుకు మధ్యలో ఉన్న జూలై 30ని ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న 'రాధేశ్యామ్‌' టీజర్‌ విడుదల కానుంది. అదే రోజు సినిమా రిలీజ్‌ డేట్‌ మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుందని వినికిడి. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

చదవండి: రాధేశ్యామ్‌ స్టోరీలైన్ తెలిసిపోయింది!

గుడ్‌న్యూస్‌ : ప్రేమికుల రోజునే 'రాధే శ్యామ్’ టీజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement