‘రాధేశ్యామ్‌’ న్యూ రిలీజ్‌ డేట్‌ ఇదే, అంతా బాగుంటే ఆ తేదే ఫిక్స్‌! | Radhe Shyam Movie New Release Date March 18th Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Radhe Shyam Movie: ‘రాధేశ్యామ్‌’ న్యూ రిలీజ్‌ డేట్‌ ఇదే, అంతా బాగుంటే ఆ తేదే ఫిక్స్‌!

Published Thu, Jan 6 2022 1:43 PM | Last Updated on Thu, Jan 6 2022 5:31 PM

Radhe Shyam Movie New Release Date March 18th Goes Viral On Social Media - Sakshi

Radhe Shyam Movie New Release Date Goes Viral Is Makers Interested On March.. ఈ సంక్రాంతికి సందడి చేస్తాయనున్న పాన్‌ ఇండియా చిత్రాలతో పాటు పెద్ద సినిమాలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ఒమిక్రాన్‌ కారణం పలు ప్రాంతాల్లో స్వల్ప లాక్‌డౌన్‌, 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్ల అనుమతి ఉండటమే. దీంతో ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ జనవరి 7న రిలీజ్‌కు రెడీ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించి అందరికి షాకిచ్చింది. దీంతో అదే డేట్‌తో జనవరి 14న వస్తామని చెప్పిన మరో పాన్‌ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌ మేకర్స్‌ మొదట ప్రకటించగా.. ఆ తర్వాత నిన్న(బుధవారం) అనూహ్యంగా మూవీని వాయిదా వేస్తున్నట్లు మరో ప్రకటన ఇచ్చారు.

చదవండి: ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్‌కు అమెజాన్‌ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే..

దీంతో ప్రభాస్‌ అభిమానులంత నిరాశలో ఉన్నారు. ఈ సినిమా విడుదల మళ్లీ ఎప్పుడు ఉంటుందని అందరిలో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రాధేశ్యామ్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనంటూ వార్తలు బయటకు వచ్చాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను మార్చి 18వ తేదీన విడుదల చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టుగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ డేట్‌ను లాక్ చేసుకుని, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చునని అనుకుంటున్నారట.

చదవండి: అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఆర్జీవీ, ట్వీట్‌ వైరల్‌

మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ కొత్త రిలీజ్‌ డేట్‌పై రాధేశ్యామ్‌ మేకర్స్‌ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా రాధకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని టి సిరీస్ - యూవీ క్రియేషన్స్  - గోపీకృష్ణ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనుండగా పూజా ప్రేరణ పాత్రలో ఆకట్టుకొనుంది. విదేశి పిరియాడికల్‌ ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 

చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement