
సంగీతంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ‘రాధేశ్యామ్’ చిత్రబృందం. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎవరు స్వరాలందిస్తున్నారనే విషయాన్ని చిత్రబృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. సౌత్ వెర్షన్స్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించనున్నారు.
అయితే హిందీ వెర్షన్‌లోని రెండు పాటలకు మిథున్ , మరో ట్రాక్‌కు మన్నన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చనున్నారు. తెలుగు వెర్షన్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందిస్తుండగా.. హిందీ వెర్షన్ కు మనోజ్ ముంతాషీర్, కుమార్ వంటివారు లిరిక్స్ అందించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా జూలై 30న రిలీజ్ కానుందని సమాచారం.
చదవండి: ‘దొరసాని’ కోలీవుడ్ ఎంట్రీ
‘తెల్లవారితే గురువారం’.. ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment