Radhe Shyam Movie Box Office Collection Creates New Records | Prabhas Pooja Hegde Radhe Shyam - Sakshi
Sakshi News home page

Radhe Shyam: సూపర్‌ హిట్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న రాధేశ్యామ్‌

Published Mon, Mar 14 2022 1:24 PM | Last Updated on Mon, Mar 14 2022 2:57 PM

Prabhas, Pooja Hegde Love Story Radhe Shyam Collections Creates Record - Sakshi

Radhe Shyam Box Office Collection: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ‘రాధే శ్యామ్’ మూవీ అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఇండియాలో మొదటి సారి ఒక ప్రేమకథకు ఈ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్‌ చేసింది రాధేశ్యామ్‌. పాజిటివ్ టాక్‌తో థియేటర్లకు ప్రేక్షకులు కదులుతున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వస్తోంది.

చదవండి: పెళ్లి, ప్రెగ్నెన్సీపై యంగ్‌ హీరోయిన్‌ క్లారిటీ

ఈ మూవీలో ప్రభాస్జ్-పూజా హెగ్డేల కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతున్నారు. అలాగే రాధా కృష్ణ కుమార్ టేకింగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ సినిమా. సినిమాకు పెట్టిన ఖర్చుకు.. చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్‌కు.. ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్‌కు.. నిర్మాతలు ఇప్పటికే సేఫ్ అయిపోయారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాధే శ్యామ్ రికార్డ్ క్రియేట్ చేసిందంటున్నారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.

చదవండి: ఆ స్టార్‌ హీరో గురించి చాలా చెప్పాలి: పూనమ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

ఇక ఇప్పుడు థియేటర్లలో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రోజుల్లో అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక ప్రేమ కథకు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ రాధే శ్యామ్ సినిమా మరోసారి నిరూపించింది. అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ.. కట్టి పడేసే క్లైమాక్స్ సన్నివేశాలు రాధే శ్యామ్ సినిమాకు పాజిటివ్ గా నిలిచాయి. ఇదే సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement