
సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Radhe Shyam Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు. గురువారం సాయంత్రం జరిగిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్యారిస్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగిన ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించింది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించారు.
ఈ భారీ ఈవెంట్‌కు కరోనా నిబంధనలను అనుసరించి భారతదేశం నలుమూలల నుంచి దాదాపు 40 వేల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. జాతిరత్నం నవీన్ పొలిశెట్టి హోస్ట్‌గా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ వర్క్ చేస్తుండటం విశేషం.