
పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో పాటు దర్శకధీరుడు రాజమౌళి కలిసి ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. జక్కన్న ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఇక ఈ సినిమా కోసం తన వంతు కృషి చేస్తుండటం గమనార్హం. తాజాగా జరిగిన ఈ ఇంటర్వూలో ప్రభాస్ జక్కన్నల మధ్య ఆసక్తికర సంబాషణలు చోటు చేసుకున్నాయి. ఇక విషయం ఏంటంటే స్టార్ హీరో ప్రభాస్ జక్కన్నని రాధేశ్యామ్ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నావంటూ సరదాగా ప్రశ్నించాడు.
అయితే దానికి రాజమౌళి నుంచి షాకింగ్ సమాధానం వచ్చింది. అదేంటంటే.. నువ్వు నా డార్లింగ్, నీకోసం ఏదైనా చేస్తానంటూ జక్కన్న బదులిచ్చారు. ఇక దాంతో ప్రభాస్‌తో పాటు తన అభిమానులు కూడా జక్కన్నకు ఫిదా అయ్యారు.
ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే.