
జనరల్‌గా సినిమా షూటింగ్స్ కోసం సెట్స్ వేస్తుంటారు. అలా ‘రాధేశ్యామ్’ సినిమా కోసం కూడా పలు సెట్స్ తయారు చేయించారు. అది మాత్రమే కాదు.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ‘నైట్ థీమ్ పార్టీ’ కోసం సెట్ ఏర్పాటు చేయించింది ఈ చిత్రబృందం. ఈ నెల 14న రాత్రి 8 గంటల నుంచి ఈ పార్టీ ప్రారంభం కానుంది.
ఈ పార్టీ కోసం ‘రాధేశ్యామ్’ సినిమా కథను ప్రతిబింబించేలా సెట్స్ వేయించారు. ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment