
'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. ఇంకేముంది.. ఒక్క హిట్టు పడటంతో తనకు టాలీవుడ్‌లో తిరుగులేదనుకున్నారు. కానీ ఆర్‌డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా ఇలా ఎన్నో సినిమాలు చేసినా పెద్ద బ్రేక్ అయితే రాలేదు. అనగనగనగా ఓ అతిథి సినిమాతో ఓటీటీలో అడుగుపెట్టి అక్కడ సక్సెస్ సాధించింది. 3 రోజెస్ అనే సిరీస్ కూడా చేసింది.
ప్రియుడితో వాలంటైన్స్ డే
కెరీర్ ఎటు వెళ్తుందో తెలియని అనిశ్చితిలో ఉన్న ఆమెకు అజయ్ భూపతి మంగళవారం సినిమా ఛాన్స్ ఇచ్చాడు. గతేడాది రిలీజైన ఈ మూవీ హిట్ కొట్టడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇకపోతే పాయల్‌కు సౌరభ్ ఢింగ్రా అనే ప్రియుడు ఉన్నాడు. తరచూ వీళ్లిద్దరు షికార్లకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14న) ఇలా సెలబ్రేట్ చేసుకున్నానంటూ పాయల్ ఓ వీడియో రిలీజ్ చేసింది.
ఇంకోసారి కొట్టాల్సింది
పబ్బులో ఉన్న ఆమె.. తన ప్రియుడు సౌరభ్ నెత్తిని బాటిల్‌తో పగలకొట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. అయ్యో అని విచారం వ్యక్తం చేస్తూనే ఇంకోసారి కొట్టాల్సింది అని కామెంట్ చేసింది. ఈ కామెంట్‌కు సౌరభ్ స్పందిస్తూ.. చాలా బ్యాడ్ ఐడియా అని రిప్లై ఇచ్చాడు. ఇక ఈ వీడియో రియల్ కాదు, రీల్ అని ఇట్టే తెలిసిపోతోంది. ఏదైనా ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా పాయల్ ఇలా చేసిందని అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment