ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్, పూజా సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. 'బాహుబలి 1 సినిమాకు విపరీతమైన ప్రమోషన్స్ చేశాం. అప్పటి నుంచి ప్రమోషన్స్ అంటే కొంత జంకు తగ్గింది. ఒకసారైతే దీపికా పదుకొనే నువ్వు ఎక్కువ మాట్లాడవంట కదా? అని అడిగింది. నాకు స్టార్టింగ్ ప్రాబ్లమ్.. కాస్త పరిచయం అయితే ఎక్కువ మాట్లాడతానని చెప్పాను. దీపికా యాటిట్యూడ్ అంటే ఇష్టం, పర్సనల్‌గా కూడా ఆమెంటే చాలా ఇష్టం. నా లైఫ్‌లో బాహుబలి మూవీతో మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు ఆదిపురుష్ చేయబోతున్నా, నా జీవితంలో ఎక్కువ భయపడింది ఈ సినిమాకే!' అని చెప్పుకొచ్చాడు. మరి ప్రభాస్, పూజా ఇంకా ఏమేం మాట్లాడారో తెలియాలంటే కింది వీడియో చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment