
‘‘రాధేశ్యామ్’ సినిమా అంతా ప్రేమతో నిండిపోయింది.. అందుకే ఈ సినిమాకు ప్రేమతో వర్క్ చేస్తున్నాను. ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచం కాస్త..
Thaman On Board For Radhe Shyam: ప్రభాస్, పూజాహెగ్డే జంటగా కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద, భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి దక్షిణాది భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం) జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, హిందీలో మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్‌ల బృందం అందించారు.
తాజాగా ‘రాధే శ్యామ్’ సౌత్ వెర్షన్స్‌కు తమన్ రీ రికార్డింగ్ అందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘‘రాధేశ్యామ్’ సినిమా అంతా ప్రేమతో నిండిపోయింది.. అందుకే ఈ సినిమాకు ప్రేమతో వర్క్ చేస్తున్నాను. ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచం కాస్త ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటుంది’’ అని ట్వీట్ చేశారు తమన్.