యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఆ సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వడంలో మాత్రం యూవీ క్రియేషన్స్ ఆలస్యం చేస్తుంది. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు.
రాధేశ్యామ్ సినిమా కంటే వెనకాల షూటింగ్ మొదలుపెట్టిన హీరోల మూవీస్ అప్‌డేట్స్ వచ్చాయి. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ కూడా అయ్యాయి. కానీ రాధేశ్యామ్ సినిమా నుంచి ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. అప్పుడెప్పుడో సినిమాకు సంబందించిన చిన్న గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. టీజర్ ను కానీ ట్రైలర్ ను కానీ , కనీసం సాంగ్స్ కానీ రిలీజ్ చేయడంలేదు. దాంతో అభిమానులంతా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థపై గుర్రుగా ఉన్నారు. తమ కోపానంతా సోషల్ మీడియా ద్వారా వెల్లగక్కుతున్నారు. ‘నిద్రలే యూవీ క్రియేషన్స్’అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ నుంచి అప్‌డేట్ వచ్చే వరకూ ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని వాళ్లు అంటున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. పిరియాడికల్ లవ్ డ్రామాగా ‘రాధేశ్యామ్’ తెరకెక్కుతుంది. కనీసం ఉగాది రోజైనా 'రాధేశ్యామ్' ట్రైలర్ ను విడుదల చేస్తే... అభిమానుల ఆవేశం కొంతవరకూ చల్లారే ఆస్కారం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment