
'కెజిఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సలార్'. కొన్నాళ్ల క్రితం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రానికి 'కెజిఎఫ్'కు సంగీతం అందించిన రవి బస్‌రూర్ మ్యూజిక్ డైరెక్టర్. హీరోయిన్‌గా శ్రుతీ హాసన్ ఆద్య రోల్ పోషిస్తోంది. ప్రముఖ నటుడు జగపతిబాబు రాజమన్నార్‌గా కనిపించనున్నాడు.
ఇక తాజా సమాచారం ఏంటంటే.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తమ 'సలార్'లో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని ప్రభాస్ అధికారికంగా ప్రకటించారు. తన తాజా చిత్రం రాధేశ్యామ్ ప్రమోషన్ ఈవెంట్‌లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రభాస్ సమాదానం ఇచ్చారు. ఇక దానిలో భాగంగా ఓ విలేకరి 'సలార్' గురించి ప్రశ్నించగా.. సినిమా స్క్రిప్ట్‌తో పాటు తన పాత్ర కూడా పృథ్వీరాజ్‌కు ఎంతో బాగా నచ్చడంతో ఆ పాత్ర చేయడానికి వెంటనే ఒప్పుకున్నారన్నారు, కాగా పృథ్వీరాజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఇక ఆ పాత్ర చేస్తున్నందుకు గానూ పృథ్వీరాజ్‌కు ప్రభాస్ కృతజ్ణతలు తెలిపాడు. ఇక 'సలార్' చిత్రం తప్పకుండా అన్ని భాషల్లోనూ పెద్ద సక్సెస్ అవుతుందని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే.