Pooja Hegde Press Meet About Radhe Shyam Movie, Know Interesting Details - Sakshi
Sakshi News home page

Pooja Hegde: నాకు ప్రేమలో పడేంత తీరిక లేదు

Published Mon, Mar 7 2022 5:44 AM | Last Updated on Mon, Mar 7 2022 9:24 AM

Pooja Hegde Pressmeet About Radhe Shyam Movie - Sakshi

‘‘రాధే శ్యామ్‌’ రెగ్యులర్‌ ప్రేమ కథ కాదు. చాలా సీరియస్, మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీ. ఈ పాత్ర ద్వారా దేవుడు నాకు ఓ చాలెంజ్‌ ఇచ్చారు.. దానికి న్యాయం చేశాననుకుంటున్నా. నేనెక్కువగా ప్రేమ కథల్లో నటించాను. కానీ ప్రస్తుతం నిజ జీవితంలో ప్రేమలో పడేంత సమయం లేదు.. నాలుగైదు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాను’’ అని హీరోయిన్‌ పూజా హెగ్డే అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధే శ్యామ్‌’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే హైదరాబాద్‌లో విలేకరులతో పంచుకున్న విశేషాలు...



‘రాధే శ్యామ్‌’లో డాక్టర్‌ ప్రేరణ పాత్ర చేశాను. ఈ పాత్రలో చాలా షేడ్స్‌ ఉన్నాయి.. చాలా డెప్త్‌ ఉంది. నా కెరీర్‌లో చాలా సవాల్‌తో కూడుకున్న పాత్ర ఇది.. నాలుగేళ్ల నుంచి ఆ పాత్రతో కనెక్ట్‌ అయి ఉన్నాను. వ్యక్తిగా నన్ను ఈ మూవీ మరింత స్ట్రాంగ్‌ చేసింది. కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ నా పాత్ర కోసం ఎక్కువ రీసెర్చ్‌ చేశాను.. ఎన్నో బుక్స్‌ చదివాను. ప్రేరణ పాత్రకి నా బెస్ట్‌ ఇచ్చాను.. అదే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుందని నమ్ముతున్నాను.



భారతీయ సంస్కృతి చాలా గొప్పది. జ్యోతిష్యంలో ఏదో ఓ పవర్‌ ఉంది. నిజ జీవితంలో నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అది కూడా ఒక సైన్స్‌. చాలామంది జ్యోతిష్యులను కలిశాను. వాళ్లు నా కెరీర్‌ గురించి చాలా కచ్చితమైన ప్రిడిక్షన్స్‌ ఇచ్చారు. నిజానికి టెలిస్కోప్‌ తయారు చేయడానికి ఎన్నో ఏళ్ల ముందే మనవాళ్లు గొప్ప ఆస్ట్రాలజీ బుక్స్‌ కూడా రాశారు.



చిన్నప్పుడు నాకు మొహమాటం ఎక్కువ. స్టేజ్‌పై డాన్స్‌ చేయాలంటే చాలా భయపడేదాన్ని. డాన్స్‌ చేయమని మా అమ్మ నన్ను వేదికపైకి నెట్టేసేది. హృతిక్‌ రోషన్, అల్లు అర్జున్‌ వంటి స్టార్స్‌తో చేసేటప్పుడు డాన్స్‌ బాగా నేర్చుకున్నాను.. ఎలాంటి బెరుకు లేకుండా ఎంతో ఎనర్జీతో చేసేదాన్ని. ∙‘ముకుంద’ మూవీ తర్వాత నేను గ్లామర్‌ పాత్రలకు సరిపోను అన్నారు. ఆ తర్వాత ‘డీజే’(దువ్వాడ జగన్నాథమ్‌) చేశాక నేను గ్లామర్‌ రోల్స్‌ మాత్రమే చేస్తానని ఫిక్స్‌ అయ్యారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నేను సంప్రదాయమైన పాత్ర చేశాను.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’లో స్టాండ్‌ అప్‌ కమెడియన్‌గా నటించాను. ‘గద్దలకొండ గణేష్‌’లో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాటకు మంచి పేరొచ్చింది. శ్రీదేవిగారు చేసిన ఆ పాటలో ప్రేక్షకులు నన్ను కూడా ఆదరించడం హ్యాపీ.  ఆడియన్స్‌ నన్ను వైవిధ్యమైన పాత్రల్లో చూడాలనుకుంటున్నారు.. అది నాకు చాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ∙ఏ సినిమాకైనా మనసుపెట్టి వందశాతం కష్టపడతాను. వాటిల్లో కొన్ని హిట్‌ అవుతాయి.. మరికొన్ని సరిగ్గా ఆడవు. దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు.. అందుకే ప్రతి సినిమాకూ ఓన్‌ డెస్టినీ ఉంటుందని నమ్ముతాను. నా పాత్రపై మాత్రమే ఫోకస్‌ పెడతాను.



జార్జియా, ఇటలీలో షూటింగ్‌ చే శాం. ఫస్ట్‌ కరోనా సమయంలో నేను చాలా భయపడ్డాను. ఇటలీలో మూడు రోజులు షూటింగ్‌ చేయగానే లాక్‌డౌన్‌ అనౌన్స్‌ చేశారు.. వెంటనే మేము అక్కడి నుంచి వచ్చేశాం.  


‘రాధే శ్యామ్‌’ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించడం సవాలుగా అనిపించింది. ఇందులో భావోద్వేగాలున్న సన్నివేశాలు చేసేటప్పుడు చాలా లోతుగా వెళ్లి నటించాను. ప్రేరణ పాత్రలోని బాధను ఫీలవుతూ గ్లిజరిన్‌ లేకుండా ఏడ్చిన సన్నివేశాలున్నాయి. రాధాకృష్ణసర్‌ కట్‌ చెప్పగానే అందరూ ‘వెరీ గుడ్‌’ అంటూ క్లాప్స్‌ కొట్టారు. ఆ సీన్‌ కంప్లీట్‌ కాగానే సేమ్‌ సీన్‌ మరో భాషలో చేద్దాం అనేవారు. ఒకే టైమ్‌లో రెండు డిఫరెంట్‌ మూవీస్‌ చేసిన ఫీల్‌ కలిగింది. ∙ తెలుగు, హిందీ వెర్షన్స్‌లో మేటర్‌ సేమ్‌ ఉంటుంది కానీ మేజిక్‌ డిఫరెంట్‌.  ఈ మేజిక్‌ని బాగా ఎంజాయ్‌ చేశాను.. ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్‌.



‘రాధే శ్యామ్‌’ సంగీతం అనుభవాన్ని ప్రేక్షకులు థియేటర్స్‌లో ఫీల్‌ అయి ‘వావ్‌’ అంటారు. ‘మీలో ఇంత మంచి క్వాలిటీస్‌ ఉన్నాయి.. అయినా పెళ్లెందుకు కాలేదు?’ అని ‘రాధే శ్యామ్‌’ లో ప్రభాస్‌గారిని అడిగాను. అది ఓ రకంగా ప్రేక్షకుల వాయిస్‌.. నాది కాదు. దానికి ఆన్సర్‌ ఏంటి? అన్నది తెలియాలంటే ‘రాధే శ్యామ్‌’ చూడాలి. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ లో నా పాత్ర కోసం కొంచెం రీసెర్చ్‌ చేశాను. నా పాత్రలకు చిన్న చిన్న ఫన్‌  జోడించడం నాకు ఇష్టం. ‘అరవింద సమేత వీర రాఘవ’లో నేను హెడ్‌ఫోన్స్‌తో కనిపించాను.. ఎందుకంటే ఆ పాత్ర సంగీతాన్ని ఇష్టపడుతుంది.



ఇండస్ట్రీలో మొదటి స్థానం, రెండో స్థానం.. ఇలా నంబరింగ్‌ గేమ్‌ని నేను నమ్మను.  తెలుగులో నాకు చాలా లాంగ్‌ కెరీర్‌ ఉండాలనుకుంటున్నాను. యాక్టర్స్, నా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌ నన్ను రిపీట్‌ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. అదే నాకు అతిపెద్ద ప్రశంస. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో రెండేసి సినిమాలు చేశాను. ‘దిల్‌’ రాజుగారి ప్రొడక్షన్‌లో రెండు సినిమాలు చేశాను. త్రివిక్రమ్‌గారితో మూడో సినిమా చేస్తున్నా. హరీష్‌ శంకర్‌తో రెండు సినిమాలు చేశా. నేను హార్డ్‌ వర్కర్‌ని.. అందుకే నిర్మాతలు నాకు గౌరవం ఇస్తున్నారు.

ప్రభాస్‌గారితో పాటు ఇప్పటివరకూ నేను నటించిన అందరు హీరోలతోనూ నా కెమిస్ట్రీ బాగుండటం హ్యాపీ. ఒక్కో హీరో ఒకోలా ఉంటారు. ప్రభాస్‌గారికి మీడియా ముందు సిగ్గెక్కువ. కానీ సెట్‌లో చాలా సరదాగా, ఎనర్జీగా ఉంటారు. ఆయన మాకు ఫుడ్‌ కూడా పంపించేవారు. ఇటలీకి వెళ్లినప్పుడు నా టీమ్‌లో ముగ్గురు కోవిడ్‌ బారిన పడ్డారు. అప్పుడు ప్రభాస్‌గారు చాలా మంచి వెజిటేరియన్‌ ఫుడ్‌ని పంపించేవారు. మా అమ్మ కూడా సంతోషపడ్డారు. తారక్‌(ఎన్టీఆర్‌) సెట్‌లో ఫుల్‌ ఎనర్జీతో ఉంటాడు.. ఒక్క టేక్‌లో చేసేస్తాడు. అల్లు అర్జున్‌ కూడా ఫుల్‌ ఎనర్జీగా ఉంటాడు.

మన (మహిళలు) పవర్‌ మన చేతుల్లోనే ఉంది. నా పాత్ర మహిళలకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటా. సావిత్రి, హేమ మాలినీ, శ్రీదేవిగార్లు ఉమెన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేసి బాగా డబ్బులొచ్చేలా చేశారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ లో నా పాత్ర  పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నా పాత్రల ద్వారా కొందరు మహిళలైనా స్ఫూర్తి పొందితే సంతోషంగా ఉంటుంది.



పాన్‌ ఇండియా హీరోయిన్‌ అనిపించుకోవాలని నా మైండ్‌లో లేదు. అన్ని భాషల్లో నటించాలని ఉంటుంది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. ‘మొహెంజొదారో’ తర్వాత హిందీలో ఆఫర్స్‌ వచ్చాయి. అయితే నాకు తెలుగు సినిమాలంటే చాలా ఎక్కువ ఇష్టం. అందుకే టాలీవుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీనే నా కెరీర్‌ను తీర్చిదిద్దింది.  నా సినిమాలు ఇప్పుడు పాన్‌ ఇండియన్‌ అయ్యాయి. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా ఆయా ఇండస్ట్రీల్లో పనిచేయడం వల్లే ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో నేనే డబ్బింగ్‌ చెబుతున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement