'ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు?' | Radhe Shyam Valentine Glimpse Released | Sakshi
Sakshi News home page

Radhe Shyam: రాధేశ్యామ్‌ నుంచి వాలంటైన్స్‌ గ్లింప్స్‌ రిలీజ్‌!

Published Mon, Feb 14 2022 2:37 PM | Last Updated on Mon, Feb 14 2022 2:56 PM

Radhe Shyam Valentine Glimpse Released - Sakshi

లైఫ్‌లో వాడి ముఖం చూడను అన్న డైలాగ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. 'కుక్‌ చేస్తావ్‌, బాగా మాట్లాడతావ్‌.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు?' అని హీరోయిన్‌ ప్రశ్నించగా

ప్రభాస్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే కథానాయిక. కృష్ణం రాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషించగా జిల్‌ ఫేమ్‌ కేకే రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వాలంటైన్స్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. లైఫ్‌లో వాడి ముఖం చూడను అన్న హీరోయిన్‌ డైలాగ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది.

'కుక్‌ చేస్తావ్‌, బాగా మాట్లాడతావ్‌.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు?' అని హీరోయిన్‌ ప్రశ్నించగా ప్రభాస్‌ తత్తరపాటుకు లోనయ్యాడు. కానీ అతడు ఏమని సమాధానం చెప్పాడన్నది మాత్రం చూపించలేదు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ వర్క్‌ చేస్తుండటం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement