
Prabhas-Pooja Hegde Radhe Shyam Movie Promotions: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’ కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. జోతిష్యం, హస్తసాముద్రికం తదితర అంశాలకు సంబంధించి చాలా హనెస్ట్‌గా ఓ విషయాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజన్ అంటున్నారు మేకర్స్.
రాజులు, యువరాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్టర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్రభాస్ నటించారు. ప్రపంచలోనే తొలిసారిగా ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ని చాలా కొత్తగా చేయాలని డిసైడ్ అయింది చిత్ర యూనిట్. జోతిష్యం నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేశారు.
అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment