
Director Radha Krishna Reveals Radhe Shyam Secret: ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ నుంచి మేకర్స్ వరసగా అప్‌డేట్స్ వదులుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని నింప్పుతున్నారు. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్, పాటలకు విశేష స్పందన వస్తోంది. ఈ రాధే శ్యామ్‌లో ప్రభాస్‌ను పరిచయం చేస్తూ ఇటీవల రిలీజ్ చేసిన సంచారి పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
చదవండి: సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాడిన ఈ పాటలో క్లాస్‌లుక్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు డైరెక్టర్ రాధాకృష్ణ రివీల్ చేసిన సీక్రెట్స్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రాధేశ్యామ్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల్లో ఆసక్తికి నెలకొంటుందని, ఈ మూవీ మొత్తం సర్‌ప్రైజ్‌లతో నిండిపోయిందన్నాడు. రోమ్, లండన్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందన్నారు. మొత్తంగా మంచు పర్వతంపై కూర్చొని సూర్యస్తమయాన్ని ఆస్వాదిస్తున్నట్టు రాధేశ్యామ్ ఉంటుందని చెప్పి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాడు.
చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఈవెంట్‌లో పెళ్లిపై స్పందించిన రణ్‌బీర్-అలియా భట్
రాధేశ్యామ్.. ఇంటెన్స్ లవ్ స్టోరీతో ఆకట్టుకోనుంది. ఇందులో హీరోహీరోయిన్లు విక్రమాదిత్య – ప్రేరణల రొమాన్స్ మాత్రమే కాదు. కథను లైఫ్ అండ్ డెత్ మధ్య సెలెబ్రేషన్‌గా చూపించబోతున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. జీవితానికి, చావుకు మధ్య పార్టీ జరిగితే ఎలా ఉంటుందన్న ఎమోషన్స్ ఇందులో క్యారీ చేశాడు. జాతకాలను నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లకి మధ్య ప్రేమను తీసుకొస్తే ఎలా ఉంటుందనేది రాధాకృష్ణ బేసిక్ ఆలోచన. ఇక వింటేజ్ యూరోప్ బ్యాక్ డ్రాప్ క్రెడిట్ మొత్తం ప్రభాస్‌కే ఇచ్చేశాడు డైరెక్టర్. 15 ఏళ్లుగా రాధేశ్యామ్ కథతో ట్రావెల్ అవుతున్నానని ప్రకటించిన రాథాకృష్ణ.. ఆ కథ పుట్టుక వెనుక ఇంట్రెస్టింగ్ పాయింట్ రాధేశ్యామ్ విడుదలతోనే రివీల్ అవుతుందని సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment