
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. ఒక ప్రేమ పాట మినహా ఈ చిత్రం పూర్తయిందని సమాచారం. అయితే ఇప్పటికే రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరించడంతో తాజా కోవిడ్ పరిస్థితుల్లో ఆ పాట చిత్రీకరణను విరమించుకున్నారని టాక్. కానీ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న టి సిరీస్ అధినేతలు ఆ ప్రేమ పాట ఉంటేనే బాగుంటుందని భావించారట.
సో.. ఈ పాటను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ పాట కోసం ముంబయ్‌లో సెట్ వేయాలని ఆలోచిస్తున్నారట. ఇక ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీలో వచ్చే ఆసుపత్రి సన్నివేశాలు, షిప్ బ్యాక్‌డ్రాప్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తాయట. ఈ ఏడాది జూలై 30న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.