
సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా కోసం ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులన్నీ అనుకూలించడంతో ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న రాధేశ్యామ్ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా నేడు(మార్చి 2)రాధేశ్యామ్ కొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది.
‘మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి’అని ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతోంది. ‘చేయి చూసి ఫ్యూచర్‌ని, వాయిస్ విని పాస్ట్‌ని కూడా చెప్పేస్తావా అని ఒకరు ప్రభాస్‌ని అడగ్గా.. ‘విని ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా ’అని ప్రభాస్ బదులిస్తాడు. ‘ఇంకోసారి చెయ్యి చూడు’ అని జగపతి బాబు అడగ్గా.. నాకు రెండో సారి చెయ్యి చూడడం అలవాటు లేదు అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. అలాగే ట్రైలర్ చివర్లో ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’ అని పూజా హెగ్డే చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది
రాజులు, యువరాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్టర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్రభాస్ నటించారు. ప్రపంచలోనే తొలిసారిగా ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం రాధే శ్యామ్. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment