పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న ‘రాధే శ్యామ్’ టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ - ప్రమోద్ - ప్రశీద నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ క్లైమాక్స్ కోసం కళ్లు చెదిరేలా ఖర్చు పెట్టారట. దాదాపు 15 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగే ఈ క్లైమాక్స్‌కి దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ కేటాయించారట మేకర్స్. 'రాధే శ్యామ్'లో క్లైమాక్స్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు నిర్మాతలు. అందుకే క్లైమాక్స్‌కి భారీ బడ్జెట్ కేటాయించారట. ఒక క్లైమాక్స్‌కే ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టారంటే.. ఇక సెట్స్‌కి, సాంగ్స్‌కి ఎంతలా ఖర్చు చేసుంటారో అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment