
Radhe Shyam OTT Release Date: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న విడుదలై మిశ్రమ టాక్‌ను తెచ్చుకుంది. ఇటలి నేపథ్యంలో సాగిన ఈ పిరియాడికల్ లవ్‌స్టోరీ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మాస్ ఆడియాన్స్‌ను నిరాశ పరిచింది. దీంతో ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాధేశ్యామ్ అమెజాన్ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది.
చదవండి: ఆనందం పట్టలేక సోషల్ మీడియాలో పంచుకున్న సమంత
దీనిపై తాజాగా అమెజాన్ ప్రైం తన ట్విటర్ ఖాతాలో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీన రాధేశ్యామ్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు స్పష్టం చేసింది. కాగా ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే అస్ట్రాలజర్‌గా కనిపించగా.. పూజ డాక్టర్ ప్రేరణగా ఆకట్టుకుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. కృష్ణంరాజు కీలక పాత్ర పోషించిన ఈ మూవీతో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె ప్రభాస్ తల్లిగా మెప్పించింది.
Hop on this magical journey of love with #RadheShyamOnPrime, April 1
— amazon prime video IN (@PrimeVideoIN) March 28, 2022
#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @GopiKrishnaMvs @TSeries pic.twitter.com/D7ZcDFfS7y