Rebel Star Prabhas: Pan India Movie Radhe Shyam Release Postponed - Sakshi

Radhey Shyam: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. మళ్లీ వాయిదా

Jan 5 2022 11:34 AM | Updated on Jan 5 2022 4:04 PM

Radhey Shyam Movie Release Postponed - Sakshi

అంతా ఊహించిందే జరిగింది. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’మళ్లీ వాయిదా పడింది. ఈ సినిమాని జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు మేకర్స్... కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించామని,  కానీ ఒమిక్రాన్‌, కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల రీత్యా చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి మీ ముందుకు వస్తామంటూ ట్వీట్‌ చేసింది. అయితే కొత్త విడుదల తేదిపై క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నరాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే డాక్టర్‌ ప్రేరణగా నటించారు. కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు.

కాగా, ఇప్పటికే మరో పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి లేకుండా పోయింది. మరోవైపు సంక్రాంతి బరిలోకి పెద్ద సంఖ్యలో చిన్న సినిమాలు వస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement