
కుమార్(ఫైల్)
సాక్షి, బళ్లారి: పవర్ స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక దావణగెరె నగరంలోని విజయనగర కాలనీకి చెందిన సీ.కుమార్ (25) అనే యువకుడు బుధవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పునీత్ రాజకుమార్ అంటే ఇష్టపడేవాడని, పునీత్ నటించిన ప్రతి సినిమాను వీక్షించేవాడని, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దావణగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
పునీత్‌కు నివాళి
రాయచూరురూరల్: కర్ణాటక విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రముఖులు, నాయకులు కేపీటీసీఎల్ భవనంలో బుధవారం పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అధ్యక్షుడు గోపి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: (కంఠీరవకు.. అభిమాన సంద్రం)
Comments
Please login to add a commentAdd a comment