
చెన్నై: దక్షిణాది సినీ రంగంలో ప్రముఖ కథానాయకుల్లో ఒకరు విశాల్. కథానాయకుడిగా నిర్మాతగా రాణిస్తున్న విశాల్ తాజాగా మరో కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను విశాల్ శుక్రవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. నాట్ ఏ కామన్ మెన్ అనే చిత్రాన్ని తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న కథానాయకుడిగా నటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం ద్వారా టీపీ.శరవణన్ అనే కొత్త దర్శకుని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. కుళ్లనరి కూట్టం, తేన్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన సన్రవణన్ ఎదు తేవయో అదువే ధర్మం అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది.
ఈ లఘు చిత్రం చూసే శరవణన్‌కు దర్శకత్వం అవకాశం ఇచ్చినట్లు విశాల్ తెలిపారు. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, బాలసుబ్రమణియం ఛాయాగ్రహణం అందిస్తున్నారని చెప్పారు. అధికారం బలం కలిగిన వ్యక్తిని ఎదిరించి ఒక సామాన్యుడి కథే నాట్ ఏ కామన్ మెన్ చిత్రం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్ పైకి వెళ్లనుందని తెలిపారు. ఇందులో నటించనున్న కథానాయికి, నటీనటులు ఎంపిక జరుగుతోందని ఆయన చెప్పారు.
చదవండి: వెండితెరపై అందాల పుట్టుమచ్చ
Comments
Please login to add a commentAdd a comment