
చెన్నై : నటుడు యోగిబాబుపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. హాస్య నటుడి నుంచి కథానాయకుడు స్థాయికి ఎదిగిన నటుడు యోగిబాబు. కాగా ఇటీవల ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం. ఇందులో నటుడు యోగిబాబు నాయీ బ్రాహ్మణుడి పాత్రలో నటించారు. మండేలా చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ తమిళనాడు నాయీ బ్రాహ్మణ కార్మికుల సంక్షేమ సంఘం నిర్వాహకులు శుక్రవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
అందులో వారు పేర్కొంటూ మండేలా చిత్రంలో నాయీ బ్రాహ్మణ కార్మికులను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, అదేవిధంగా వైద్య సామాజిక వర్గానికి చెందిన 40 లక్షల మంది మనోభావాలకు భంగం కలిగే విధంగా సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాబట్టి మండేలా చిత్ర దర్శక నిర్మాతలు అందులో నటించిన యోగిబాబులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
చదవండి: సరదా మాటలు.. రొమాంటిక్ పాటలు!
Comments
Please login to add a commentAdd a comment